Begin typing your search above and press return to search.
లెంపకాయ లాగి ఇండియాకొచ్చిన విల్ స్మిత్!
By: Tupaki Desk | 24 April 2022 12:31 PM GMTహాలీవుడ్ నటుడు విల్ స్మిత్ ఆస్కార్ అవార్డుల వేడుకల్లో హోస్ట్ క్రిస్ రాక్ ని చెంప దెబ్బకొట్టి ఏ రేంజ్ లో వైరల్ అయ్యారో తెలిసిందే. విల్ స్మిత్ సోషల్ మీడియాలో ఇలా వైరల్ అవ్వడం ఇదే మొదటిసారి. భార్య అనారోగ్యాన్ని ఉద్దేశించి రాక్ నోరు జారడంతోనే స్మిత్ ఆవేశంలో చేయి చేసుకున్నారు. ఆ తర్వాత అదే వేదికపై క్షమాపణలు కోరారు. కానీ నిషేధం తప్పలేదు. 10 ఏళ్ల పాటు ఆస్కార్ లో పాల్గొనకుండా నిషేధం విధించింది కమిటీ. దీంతో విల్ స్మిత్ మనశ్శాంతి కోల్పోయారు.
సోషల్ మీడియాలో కామెంట్లు...కమిటీ నిషేధంతో ప్రపంచ వ్యాప్తంగా ఆయన కీర్తి ప్రీతిష్టల్ని కొంత వరకూ దెబ్బతిన్నాయి. ఈ ఘటన జరిగిన తర్వాత తొలిసారి విల్ స్మిత్ దేశం దాటాడు. అదీ అమెరికా నుంచి నేరుగా ఇండియాకి రావడం విశేషం. శనివారం ముంబై విమానశ్రయంలో ప్రత్యక్షమయ్యారు. హాలీవుడ్ నటుడు కి ముంబైలో ఏంటి? అని చూపరులు చర్చించుకున్నారు.
విమానశ్రయం నుంచి నేరుగా జుహూలోని జెడబ్ల్యూ మారిటయ్ హోటల్ లో దిగారు. అయితే విల్ స్మిత్ ఇండియాకి రావడానికి గల కారణాలు ఏంటి? అని అంతా ఆలోచనలో పడ్డారు. ఆయన సన్నిహితుల సమాచారం మేరకు విల్ స్మిత్ ఇషా పౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్ ని కలిసేందుకు ఇండియాకి వచ్చినట్లు తెలుస్తుంది.
చెంపదెబ్బ ఘటన తర్వాత తనలో చోటు చేసుకున్న చింతన నుంచి బయటకు రావడానికి ఇలా హుటా హుటిన సద్గురు ఆశ్రమానికి చేరుకున్నట్లు గుసగుస వినిపిస్తుంది. సద్గురుతో కాస్త సమయాన్ని గడిపి మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం కోసమే ఇండియా వచ్చినట్లు చెబుతున్నారు. మరి ఇక్కడ ఎన్ని రోజులు ఉంటారు? అన్నది తెలియాలి.
విల్ స్మిత్ ఇండియాకి రావడం కొత్తేంకాదు. హిందు మతాన్ని ఆచరించడంలో ముందుండే నటుడు. క్రైస్తవుడు అయినా ఇంట్లో హిందువుల పూజలు నిర్వహిస్తుంటారు. భగవద్గీత..రామాయణాన్ని పఠిస్తుంటారు. గతంలో హిందు దేవాయాల్ని సందర్శించారు. భారత్ దేశం గురించి ఎంతో గొప్పగా చెబుతుంటారు. ఇక్కడి సంస్కృతి సంప్రదయాలంటే ఎంతో గౌరవిస్తారు.