Begin typing your search above and press return to search.
నా ఇల్లు డబ్బు కెరీర్ అన్నీ పోగొట్టుకున్నానని భయపడ్డా!
By: Tupaki Desk | 28 May 2022 1:06 PM GMTకొన్నిసార్లు కొన్ని భ్రమలు చాలా ప్రమాదకరంగా మారతాయి. తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న ప్రముఖ స్టార్ హీరో విల్ స్మిత్ పరిస్థితి అందుకు భిన్నంగా లేదు. అతడు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. చేయకూడనివి చేస్తున్నాడు. ఇంతకుముందు ఆస్కార్ అవార్డుల ప్రకటన వేదికపై సాటి నటుడు క్రిస్ రాక్ ని చెంపదెబ్బ కొట్టి వివాదానికి ఆజ్యం పోసాడు. ఆ తర్వాత అతడు రాక్ కి ఆస్కార్ నిర్వాహకులకు ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పాడు.
అయితే ఆ చెంప దెబ్బకు ముందు విల్ చాలా తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొన్నానని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. డ్రగ్స్ మత్తుకు బానిసవ్వడమే దీనికి కారణమని చెప్పాడు. అంతకుముందు స్మిత్ తన కెరీర్ - డబ్బు- ఇల్లు సర్వస్వం `గోయింగ్ అవే` అని భ్రమపడ్డాడట. హాలూసినోజెనిక్ డ్రింక్ అయిన అయాహువాస్కాను తీసుకున్న తర్వాత విల్ స్మిత్ అన్నిటినీ కోల్పోతున్నట్లు ఊహించాడట.
ఆస్కార్ 2022లో విల్ స్మిత్ అవమానకర చెంపదెబ్బ సంఘటనకు ముందు తన కెరీర్ నాశనం అవుతుందని ఊహించుకున్నాడట. డేవిడ్ లెటర్ మ్యాన్ షో `మై నెక్స్ట్ గెస్ట్ నీడ్స్ నో ఇంట్రడక్షన్` అకాడెమీ అవార్డ్స్ కు ముందు చిత్రీకరించారు. ఇందులో విల్ విచిత్రమైన విషయాన్ని చెప్పుకొచ్చాడు. అతను డ్రగ్స్ సేవించిన తర్వాత తన కెరీర్- డబ్బు- ఇల్లు ఏమైపోతున్నాయో అంటూ ఎలా భ్రాంతి చెందాడో వెల్లడించాడు.
దక్షిణ అమెరికా హాలూసినోజెనిక్ ప్లాంట్ అయాహువాస్కాతో ప్రయోగాలు చేసిన సమయాన్ని వెల్లడించాడు. ``నేను తాగాను.. సాధారణంగా ఆ మత్తు లోపలికి ప్రవేశించడానికి దాదాపు 45 నిమిషాలు పడుతుంది. ఆ సమయంలో నేను అక్కడ కూర్చున్నాను. బహుశా ఈ సమయంలో అది ఏమైనా చేస్తుంది అని భావించాను. కాబట్టి నేను తాగి అక్కడే కూర్చున్నాను. ఆపై అకస్మాత్తుగా నా డబ్బు అంతా ఎగిరిపోవడాన్ని చూసాను. నా ఇల్లు ఎగిరిపోతోంది. నా కెరీర్ పారిపోతుంది. నేను నా డబ్బు నా కెరీర్ ని పట్టుకోడానికి ప్రయత్నిస్తున్నాను. నా జీవితమంతా నాశనమైపోతోందని ఊహించుకున్నాను`` అని విల్ చెప్పాడు.
అప్పుడు నెమ్మదిగా నేను నా డబ్బు గురించి పట్టించుకోవడం మానేశాను. ఆ తరవాత నేను నా ఇంటి గురించి పట్టించుకోవడం మానేశాను. నా కెరీర్ గురించి పట్టించుకోవడం మానేశాను... అంటూ మత్తులో తాను ఎలాంటి భ్రమల్ని అనుభవించాడో చెప్పాడు.
నా ప్రవర్తన సరి కాదన్న విల్ స్మిత్
ఆస్కార్ 2022లో హాలీవుడ్ వెటరన్ హీరో విల్ స్మిత్ యాక్ట్ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఆస్కార్ హోస్ట్ క్రిస్ రాక్ ను తన మాజీ భార్య గురించి జోక్ చేసినందుకు చెంపదెబ్బ కొట్టాడు. భార్య జాడా స్మిత్ పై క్రిస్ రాక్ చేసిన జోక్ తో భావోద్వేగానికి గురైన విల్ స్మిత్ వేదికపైకి వచ్చి క్రిస్ రాక్ ని చెంప చెల్లుమనిపించాడు. జాడా స్మిత్ అలోపేసియా ఏరియాటా అనే వ్యాధితో బాధపడుతున్నారు. ఇది ఆమె జుట్టు రాలడానికి కారణమైంది. కానీ దానిపై జాడా జోక్ చేసాడు. నవ్వించే ప్రయత్నం చేసాడు. జాడాపై క్రిస్ జోక్ ని విల్ స్వీకరించలేకపోయాడు.
అయితే పబ్లిక్ వేదికపై అలా దొరికిపోవడం అనంతరం అతడిలో పశ్చాత్తాపానికి కారణమైంది. అతను తన తప్పును గ్రహించి షో నిర్వాహకులతో పాటు ప్రపంచవ్యాప్తంగా లైవ్ చూసిన ప్రతి ఒక్కరికి.. అలాగే క్రిస్ కి బహిరంగ క్షమాపణలు చెప్పాడు. విల్ స్మిత్ తన తప్పును అంగీకరించాడు. అతని ప్రవర్తన ఆమోదయోగ్యం కాదని క్షమించరానిదని అన్నారు. హింస విషపూరితమైనదని విధ్వంసకరమైనదని ఆయన అన్నారు. ఆ క్షణం ఎమోషనల్ అయిపోయానని తెలిపాడు. తన చర్య తనను ఇబ్బంది పెట్టిందని అన్నారు. సుదీర్గ లేఖలో విల్ స్మిత్ ఏమని పేర్కొన్నారంటే.. అన్ని రూపాల్లో హింస అనేది విషపూరితమైనది. విధ్వంసకరమైనది. గత రాత్రి అకాడమీ అవార్డ్స్ లో నా ప్రవర్తన ఆమోదయోగ్యం కాదు.
క్షమించరానిది. జోకులు హోస్ట్ ఉద్యోగంలో ఒక భాగం.. కానీ జాడా యొక్క వైద్య పరిస్థితి గురించి ఒక జోక్ భరించలేకపోయాను. నేను భావోద్వేగంగా స్పందించాను. నేను మీకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను క్రిస్. నేను తప్పు చేశాను. నేను సిగ్గుపడుతున్నాను.. నా చర్యలు నేను ఉండాలనుకుంటున్న వ్యక్తిని సూచించలేదు. ప్రేమ- దయ ఉన్న ప్రపంచంలో హింసకు చోటు లేదు. నేను అకాడమీకి షో నిర్మాతలకు.. హాజరైన వారందరికీ .. ప్రపంచవ్యాప్తంగా లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికీ క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. నేను విలియమ్స్ కుటుంబానికి .. నా కింగ్ రిచర్డ్ కుటుంబానికి క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. నా ప్రవర్తన మనందరికీ చెత్తగా మారినందుకు నేను తీవ్రంగా చింతిస్తున్నాను. నేను పనిలో ఉన్నాను`` అని విల్ స్మిత్ చేసిన తప్పుకు పాశ్చాత్తాపం ప్రకటించారు.
ఆస్కార్ వేదికపైనే ఇలాంటి షాక్ రేర్
విల్ స్మిత్ ఆస్కార్ వేదికపైకి దూసుకెళ్లి తన భార్య గురించి సరదాగా మాట్లాడినందుకు హాస్యనటుడు క్రిస్ రాక్ ను ముఖం మీద కొట్టాడు. ఆదివారం నాడు ఇది క్షణకాలంలోనే వైరల్ అయ్యింది. నిజానికి ఇది స్క్రిప్ట్ ప్రకారమేనా? లేదా నిజమైనదా? అని ప్రశ్న ఉత్పన్నమైంది. ప్రేక్షకులను ఈ ఆకస్మిక సన్నివేశం ఎంతగానో ఆశ్చర్యపరిచింది.రాక్ ఒక చిన్న కామెడీ రొటీన్ తో ఉత్తమ డాక్యుమెంటరీ బహుమతిని అందజేస్తూ.. జాడా పింకెట్ స్మిత్ పై జోక్ చేశాడు. తన బిగుతుగా కత్తిరించిన జుట్టును `G.I. జేన్` చిత్రంలో డెమీ మూర్ రూపంతో పోలుస్తూ ఆమెను సీక్వెల్ లో కనిపించమని సూచించాడు. ఈ జోక్ నిజానికి చాలా అసహ్యంగా ఉంది. డాల్బీ థియేటర్ లో ఇబ్బందికరమైన నిశ్శబ్దం.. గందరగోళాన్ని కలిగి ఉన్న క్షణంలో స్మిత్ నేరుగా రాక్ వద్దకు వెళ్లి అతనిని చెంపదెబ్బ కొట్టాడు. జాడాతో పాటు తన సీటుకు తిరిగి వచ్చి అసభ్య పదజాలంతో అరిచాడు.
నా భార్య పేరును మీ నోటి నుండి బయటకు రానివ్వకండి!! అని స్మిత్ అరిచాడు. యునైటెడ్ స్టేట్స్ లో టెలివిజన్ లో ప్రసారం చేయబడిన అనేక సెకన్ల ఆడియోను తొలగించాలని నిర్మాతలను బలవంతం చేశాడు. మొత్తానికి ఇలా ఒక అవార్డుల వేదికపై జరగడం ఆశ్చర్యపరిచింది. పైగా ఆస్కార్ వేదికపైనే ఈ ఘట్టం కనిపించడం బిగ్ షాక్ నివ్వడంతో ఆ తర్వాత తేరుకుని విల్ క్షమాపణలు చెప్పారు.