Begin typing your search above and press return to search.

2019 రిలీజ్‌: అల్లావుద్దీన్ అద్భుత దీపం

By:  Tupaki Desk   |   11 Feb 2019 12:47 PM GMT
2019 రిలీజ్‌: అల్లావుద్దీన్ అద్భుత దీపం
X
అల్లావుద్దీన్ అద్భుత దీపం .. ప‌రిచ‌యం అవ‌స‌రం లేని సౌండింగ్ ఇది. చంద‌మామ, బొమ్మ‌రిల్లు, బుజ్జాయి క‌థ‌ల‌ పుస్త‌కాల్లో చిన్న‌ప్పుడు ప్ర‌త్యేకించి అల్లాడిన్ క‌థ‌లు చ‌దువుకున్న వాళ్లు అంత తేలిగ్గా మ‌ర్చిపోలేరు. ఇంగ్లీష్‌ కామిక్ బుక్స్ లోనూ అల్లాడిన్ క‌థ‌లు ఓ సంచ‌ల‌నం. అన‌గ‌న‌గ ఓ బాలుడు .. అత‌డి చేతిలో లాంత‌రు.. ఆ దీపంలో దాగి ఉంది బూతం.. అంటూ పూర్వ ం అమ్మ‌మ్మ‌లు, తాత‌య్య‌లు.. క‌థ‌లు చెబుతుంటే చెవులు రిక్కించి విన్న రోజులు గుర్తుకొస్తాయి. అల్లాడిన్ క‌థ‌ల‌ చ‌రిత్ర అత్య ంత పురాత‌న‌మైన‌ది.

అల్లావుద్దీన్ కి తెలుగు సినిమాతోనూ అనుబంధం ఉంది. 1957లోనే అక్కినేని నాగేశ్వ‌ర‌రావు, అంజ‌లీదేవి, ఎస్వీఆర్‌ ప్ర‌ధాన పాత్ర‌ల్లో `అల్లావుద్దీన్ అద్భుతదీపం` చిత్రం తెర‌కెక్కి విడుదలైంది. దీనిని తెలుగు- తమిళంలో ఒకేసారి రిలీజ్ చేశారు. త‌మిళంలో `అల్లావుద్దీన్ అర్పుత విళక్కుం` పేరుతో రిలీజైంది. హిందీలో `అల్లాడిన్ కా చిరాగ్` అనే పేరుతోను నిర్మించారు. అంతటి ఘ‌న‌త వ‌హించిన ఆ సినిమాని మెగాస్టార్ చిరంజీవి కథానాయ‌కుడిగానూ తెర‌కెక్కించేందుకు ప్ర‌య‌త్నాలు సాగినా అది ఎందుక‌నో కుద‌ర‌లేదు. ఇక డిస్నీ సంస్థ ఇప్ప‌టికే అల్లాడిన్ యానిమేష‌న్ చిత్రాన్ని నిర్మించిన సంగ‌తి తెలిసిందే.

చాలా కాలానికి మ‌రోసారి `అల్లావుద్దీన్` ప్ర‌స్థావ‌న వ‌చ్చింది. అందుకు కార‌ణం తాజాగా రిలీజైన అల్లాడిన్ హాలీవుడ్ ట్రైల‌ర్. ప్ర‌ముఖ హాలీవుడ్ ద‌ర్శ‌కుడు, షెర్లాక్ హోమ్స్ ఫేం గ‌య్ రిచీ .. విల్ స్మిత్ ప్ర‌ధాన పాత్ర‌లో అల్లాడిన్ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇదో లైవ్ యాక్ష‌న్ సినిమా అంటూ యూనిట్ ప్ర‌చారం చేస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన ట్రైల‌ర్ లో విల్ స్మిత్ వింతైన భూతం పాత్ర‌లో క‌నిపించి మైమ‌రిపించారు. మెన్ ఇన్ బ్లాక్ త‌ర్వాత విల్ స్మిత్ మ‌ళ్లీ ఓ ప్ర‌యోగాత్మ‌క పాత్ర‌తో మైమ‌రిపించ‌నున్నార‌ని ఈ ట్రైల‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతోంది. ఇక ఈ ట్రైల‌ర్ ఆద్య ంతం నైట్ ఎఫెక్ట్ తో బ్లూ లైటింగ్ తో డిఫ‌రెంట్ లుక్ తో ఆక‌ట్టుకుంది. ఇక ఈ చిత్రంలో మిడిల్ ఈస్ట్ కి చెందిన ప‌లువురు అర‌బ్ న‌టులు న‌టిస్తున్నారు. స్కాట్, మ‌సౌద్, కెంజారి, నాజిమ్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు. దాలియా అనే ఇరానియ‌న్ అమెరిక‌న్ యువ‌తి జాస్మిన్ పాత్ర‌లో న‌టిస్తోంది. ప్ర‌ఖ్యాత డిస్నీ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది మే 24న రిలీజ‌వుతోంది. తాజాగా రిలీజ్ చేసిన ట్రైల‌ర్ ఆస‌క్తిని పెంచింది. ఇండియాలో ఈ సినిమా ఎలాంటి సంచ‌ల‌నాలు సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే. ఇక ప్ర‌తిష్ఠాత్మ‌క‌ డిస్నీ నిర్మించిన డంబో మే 29న, ది లయ‌న్ కింగ్ జూలై 19న రిలీజ్ కానున్నాయి.