Begin typing your search above and press return to search.
మేజర్ విషయంలో సోనీ పిక్చర్స్ ప్లాన్ ఫలించేనా?
By: Tupaki Desk | 23 May 2022 6:30 AM GMTపుష్ప, ట్రిపుల్ ఆర్, కేజీఎఫ్ 2 తనేవాత దక్షిణాది నుంచి సినిమా అంటే ఉత్తరాదిలో మోర్ అటెన్షన్ క్రియేట్ అవుతోంది. సినిమా ఎలా వుంటుంది? ఎవరు నటించారు? సినిమా ఏ రేంజ్ లో హల్ చల్ చేయబోతోంది? వంటి పలు ఆంశాలపై చర్చ జరుగుతోంది. దీంతో ప్రత ఈమేకర్ దక్షిణాదిలో పాటు ఉత్తరాదిలో తమ సినిమా భారీ కలెక్షన్ లని సాధించాలని ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. అంతే కాకుండా భారీ స్థాయిలో రూపొందిన సినిమాల విషయంలో ఉత్తరాది నుంచి మరింత క్రేజ్ ని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.
ప్రస్తుతం అడివి శేష్ హీరోగా నటించిన పెట్రియాటిక్ మూవీ `మేజర్` విషయంలో ప్రముఖ నిర్మాణ సంస్థ సోనీ పిక్చర్స్ ఇంటర్నేషల్ ప్రొడక్షన్స్ ఈ మూవీని రిలీజ్ చేస్తోంది. జూన్ 3న విడుదల కానున్న ఈ మూవీకి ఉత్తరాదిలో భారీ బజ్ ని క్రియేట్ చేయాలని సదరు సోనీ సంస్థ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.
అంతే కాకుండా హిందీ బెల్ట్ నుంచి ఈమూవీకి భారీ స్థాయిలో వసూళ్లని ఆశిస్తోంది కూడా. గత కొన్ని నెలలుగా దక్షిణాదికి చెందిన పలు చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ ఉత్తరాది బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో వసూల్లని రకాబడుతూ సంచలనాలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే.
అదే తరహాలో `మేజర్` సినిమా కూడా ఉత్తరాదిలో భారీ వసూళ్లని రాబట్టాలని సోనీ పిక్చర్స్ సంస్థ భారీగా ప్రయత్నిస్తోంది. ట్రిపుల్ ఆర్, పుష్ప, కేజీఎఫ్ 2 చిత్రాలతో పోలిస్తే `మేజర్` డిఫరెంట్ జానర్ మూవీ. అవి మాస్ ప్రేక్షకుల్ని పతాక స్థాయిలో ఎట్రాక్ట్ చేశాయి. అంతే కాకుండా అందులో క్రేజీ స్టార్లు నటించారు. కంటెంట్ మాస్ ప్రేక్షకుల దాకా వెళ్లింది. వారిని థియేటర్లకు రప్పించింది. దాంలో ఈ మూడు చిత్రాలకు ఉత్తరాది బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో వసూళ్ల వర్షం కురిసింది.
అయితే `మేజర్` సినిమా చాలా ప్రత్యేకమైనది. 2008లో ముంబై తాజ్ హోటల్ పై ఉగ్రమూకలు చేసిన మరణ హోమం నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇదే కథతో ఇంతకు ముందు రామ్ గోపాల్ వర్మ `ది అటాక్స్ ఆఫ్ 26 /11` పేరుతో తొమ్మిదేళ్ల క్రితమే ఓ సినిమా చేశాడు. అదే కథని మరో యాంగిల్ లో చెబుతూ ఇందులో ఉగ్రవాదులకు ఎదురొడ్డి ప్రాణాలని సైతం లెక్కచేయక వీరోచితంగా పోరాడి అసువులు బాసిన రియల్ హీరో సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ గా ఈ మూవీని రూపొందించారు.
హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాల సమాహారంగా ఈ మూవీని రూపొందించారు. ఇదొక హై క్లాస్ ఫిల్మ్. మాస్ అంశాలు ఏ మాత్రం కనిపించవు. కానీ సినిమాలో ప్రధానంగా దేశ భక్తి కోణాన్ని అత్యంత ప్రభావవంతంగా తెరకెక్కించారు. ఈ అంశం ప్రేక్షకుల్ని ఖచ్చితంగా కట్టిపడేస్తుంది. ఇదే నమ్మకంతో ఉత్తరాదిలో ఈ సినిమాని భారీగా ప్రమోట్ చేస్తోంది సోనీ పిక్చర్స్ సంస్థ. అంతే కాకుండా భారీగా హిందీ బెల్ట్ నుంచి వసూళ్లని ఆశిస్తోంది. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం దేశ భక్తి ప్రతీ ఒక్కరిలోనే కనిపిస్తున్న నేపథ్యంలో `మేజర్` సోనీ అంచనాల మేరకు భారీ వసూళ్లని రాబట్టడం ఖాయం అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. అదే జరిగితే సోనీ పిక్చర్స్ ప్లాన్ ఫలించినట్టే.