Begin typing your search above and press return to search.
మంచు విష్ణుకు సన్నీ లక్కు తెచ్చిపెట్టేనా?
By: Tupaki Desk | 10 Sep 2022 8:46 AM GMTమంచు విష్ణు నటిస్తున్న లేటెస్ట్ రొమాంటిక్ యాక్షన్ కామెడీ మూవీ 'జిన్నా'. సూర్య దర్శకత్వం వహించాడు. దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి కథ అందించిన ఈ మూవీలో పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ హీరోయిన్ లుగా నటించారు. ప్రారంభం నుంచి ఈ మూవీ ఏదో విధంగా వార్తల్లో నిలుస్తూ వస్తోంది.
కారణం 'దేనికైనా రెడీ' సినిమా తరువాత మంచు విష్ణు హిట్టు అనే మాట విని కొన్నేళ్లవుతోంది. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ ని సొంతం చేసుకోవాలనే ఆలోచనతో ప్రతీ కాంట్రవర్సీని అనుకూలంగా మారు్చుకుంటూ వార్తల్లో నిలవాలని 'జిన్నా' టైటిల్ ని ఈ మూవీకి ఎంచుకున్నారు.
అక్కడి నుంచే ఆ ప్రాజెక్ట్ వార్తల్లో నిలవడం మొదలు పెట్టింది. శుక్రవారం రాత్రి ఈ మూవీ ట్రైలర్ ని విడుదల చేశారు. పల్లెటూళ్లో లెంట్ హాస్ నడుపుకునే జులాయి జిన్నా.. ఊరంతా అప్పులు చేస్తాడు. ఇదే సమయంలో అతని జీవితంలోకి ఓ యువతి ఎంట్రీ ఇస్తుంది. చిన్ననాటి స్నేహితురాలు స్వాతికి జిన్నా అంటే ఇష్టం. ఇదేఈ క్రమంలో ఏం జరిగింది? జిన్నాని అప్పుల సుడిగుండం నుంచి కొత్తగా వచ్చిన యువతి బయటపడేసిందా? మధ్యలో దెయ్యం గోల ఏంటీ?
జిన్నాని వెతుక్కుంటూ వచ్చిన యువతి మనిషా దెయ్యమా? అనే ఆసక్తికర కథనంతో ఈ మూవీని తెరకెక్కించినట్టుగా ట్రైలర్ తో క్లారిటీ వచ్చేసింది. కోన వెంకట్ అండ్ కో ఈ మూవీకి రైటింగ్ సైడ్ బ్యాక్ బోన్ గా నిలిచారు. ట్రైలర్ ని బట్టి చూస్తుంటే ఈ సినిమా భారం మొత్తం సన్నీలియోన్ పైనే వున్నట్టుగా తెలుస్తోంది. కారణం తన పాత్ర చుట్టే కథ తిరుగుతుందని ట్రైలర్ స్పష్టం చేస్తోంది. ఇదే విషయాన్ని ఇండైరెక్ట్ గా హీరో మంజు విష్ణు ట్రైలర్ రిలీజ్ లో వెల్లడించాడు.
సన్నీ డేట్లని బట్టే సినిమా ప్లాన్ చేశామని, తను తప్పితే ఈ పాత్రకు మరొకరు చూట్ అయ్యేవారు కాదని మంచు విష్ణు స్వయంగా చెప్పడంతో సన్నీకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో అర్థమవుతోంది. ఎంటర్ టైన్ మెంట్ ప్రధానంగా సాగే ఈ మూవీని అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టుగా ప్రకటించారు. అయితే అక్టోబర్ లో చిరు 'గాడ్ ఫాదర్', నాగ్ 'ది ఘోస్ట్' సినిమాలు వుడంటంతో సరైన సమయం చూసుకుని థియేటర్లలోకి వదలబోతున్నారట.
గత కొన్నేళ్లుగా ఫామ్ ని కోల్పోయి హిట్టు కోసం ఎదురుచూస్తున్న మంచు విష్ణు లక్కు సన్నీ లియోన్ చేతిలో వుందన్నమాట. మరి సన్నీ ఈ మూవీతో మంచు విష్ణు కు సక్సెస్ ని అందించి లక్కుని తెచ్చిపెడుతుందా? అన్నది తెలియాలంటే 'జిన్నా' రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే. ఈ మూవీకి అనూప్ రూబెన్స్ సంగీతం అందించగా చోటా కె. నాయుడు ఛాయాగ్రహణం, చోటా కె. ప్రసాద్ ఎడిటింగ్ అందించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.