Begin typing your search above and press return to search.
సుధ చేతిలో సూర్య భవితవ్యం
By: Tupaki Desk | 5 Jun 2019 5:30 AM GMTతమిళంతో పాటు తెలుగులో కూడా మంచి స్టార్ డంను కలిగి ఉన్న సూర్య గత కొంత కాలంగా వరుసగా ఫ్లాప్ అవుతూ వస్తున్నాడు. తాజాగా వచ్చిన ఎన్జీకే చిత్రంతో అయినా అక్కడ ఇక్కడ కాస్త పరువు దక్కించుకుంటాడని అనుకున్నారు. కాని ఎన్జీకే చిత్రం సూర్య కెరీర్ లో మరో ఫ్లాప్ గా నిలిచింది. సెల్వ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఎన్జీకే' చిత్రం తమిళ మరియు తెలుగు ప్రేక్షకులను మెప్పించడంలో విఫలం అయ్యింది. దాంతో సూర్య కెరీర్ మరింత కష్టాల్లోకి జారినట్లయ్యింది.
వరుసగా ఫ్లాప్ అవుతున్న సూర్యకు ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో భారీగా మార్కెట్ పడిపోయింది. కొన్ని సంవత్సరాల ముందు వరకు సూర్య చిత్రం తెలుగులో మంచి బిజినెస్ చేసేది. ఓపెనింగ్స్ కూడా స్టార్ హీరోల సినిమాల రేంజ్ లో వచ్చేవి. కాని ప్రస్తుత పరిస్థితి మారింది. సూర్య సినిమాకు ఓపెనింగ్స్ రావడం లేదు. సినిమా బాగుంటే తప్ప సూర్య సినిమాను చూసే వారు లేరు. ఇలాంటి సమయంలో సూర్య నటిస్తున్న సినిమా 'సూరారై పోత్రు' పై అందరి దృష్టి ఉంది.
తెలుగు దర్శకురాలు అయిన సుధ కొంగర దర్శకత్వంలో రూపొందుతున్న 'సూరారై పోత్రు' మూవీ ఫస్ట్ లుక్ ఇప్పటికే వచ్చింది. విభిన్నమైన నేపథ్యంతో సుధ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. సూర్య చాలా ఇష్టపడి ఈ చిత్రాన్ని చేస్తున్నట్లుగా తెలుస్తోంది. తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ చిత్రం తప్పకుండా ఆకట్టుకుంటుందనే నమ్మకంను చిత్ర యూనిట్ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే సగం వరకు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రంను 2020 ఆరంభంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్ చేశారు. బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రం సక్సెస్ అయితేనే సూర్య తమిళంలో అయినా కెరీర్ ఇబ్బంది లేకుండా ముందుకు సాగుతుంది. ఈ సినిమా ఫలితం కూడా తారు మారు అయితే సూర్య మరింతగా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.