Begin typing your search above and press return to search.
తమిళ హీరోలు తెలుగు నిర్మాతల నమ్మకాన్ని నిలబెడతారా..?
By: Tupaki Desk | 21 Oct 2022 3:41 AM GMTపాన్ ఇండియా సినిమాల సందడి మొదలైన తర్వాత ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో భాషా ప్రాంతీయత అడ్డంకులు తొలగిపోయాయి. నటీనటులందరూ ఎలాంటి బేధాలు లేకుండా అన్ని భాషల సినిమాల్లో నటించడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఫిలిం మేకర్స్ సైతం ఇతర ఇండస్ట్రీలలో సత్తా చాటడానికి ప్రయత్నిస్తున్నారు.
తెలుగు చిత్ర పరిశ్రమ ఇప్పుడు భారతీయ సినిమాలో ఆధిపత్యం చెలాయిస్తున్న నేపథ్యంలో.. తమిళ స్టార్స్ అంతా తెలుగు మార్కెట్ మీద దృష్టి పెట్టారు. టాలీవుడ్ దర్శక నిర్మాతల వైపు చూస్తూ.. తెలుగు సినిమాలు చేయడానికి ఉత్సాహం కనబరుస్తున్నారు.
ఈ నేపథ్యంలో పలువురు టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ భారీ మొత్తాలను అడ్వాన్స్ లుగా చెల్లించి తమిళ హీరోలను లాక్ చేసుకున్నారు. వారితో తెలుగు తమిళ ద్విభాషా సినిమాలు చేస్తూ.. కోలీవుడ్ లోనూ ఎంట్రీ ఇవ్వడానికి ప్లాన్స్ వేసుకున్నారు.
విజయ్ - ధనుష్ - శివకార్తికేయన్ వంటి కోలీవుడ్ స్టార్ ఇప్పుడు నేరుగా తెలుగు చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే. వారి తమిళ మార్కెట్ లను పరిగణనలోకి తీసుకుని భారీ రెమ్యునరేషన్స్ అందించారు. అయితే టాలీవుడ్ డైరెక్టర్లు - కోలీవుడ్ స్టార్స్ కాంబినేషన్లో రూపొందిన సినిమాలకు బిజినెస్ లు అంతగా లేవనే టాక్ వినిపిస్తోంది.
తమిళ స్టార్లతో చేసిన సినిమాల థియేట్రికల్ రైట్స్ ను వారి సాధారణ మార్కెట్ కంటే చాలా తక్కువగా కోట్ చేస్తుండటంతో.. దర్శకనిర్మాతలు షాక్ అవుతున్నారట. తెలుగు థియేట్రికల్ మార్కెట్ పూర్తిగా సినిమా చుట్టూ నెలకొన్న బజ్ మరియు ట్రైలర్ పై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతానికి ఆ సినిమాల ప్రీ-రిలీజ్ బిజినెస్ గురించి క్లారిటీ లేదని తెలుస్తోంది.
'వారసుడు' సినిమా కోసం విజయ్ 100 కోట్లకు పైగానే వసూలు చేసాడనే ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే.. సేఫ్ ప్రాజెక్ట్ గా ముగించడానికి.. నిర్మాత దిల్ రాజు బయటపడటానికి ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలవాల్సి ఉంది. సంక్రాంతి సీజన్ లో టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలకు పోటీగా రాబోతున్న విజయ్.. ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.
అలానే 'సార్' సినిమా కోసం ధనుష్ దాదాపు 25 కోట్ల వరకూ తీసుకుంటున్నాడని టాక్. గత కొంతకాలంగా ధనుష్ సినిమాలు తమిళ్ లో సక్సెస్ అవుతున్నా.. తెలుగులో మాత్రం ఆకట్టుకోలేకపోయాయి. కాకపోతే సితార ఎంటర్టైన్మెంట్స్ అతని ట్రాక్ రికార్డును నమ్ముకొని దిగుతున్నారు. డిసెంబర్ ఫస్ట్ వీక్ లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
'వరుణ్ డాక్టర్' 'కాలేజ్ డాన్' చిత్రాలతో మంచి విజయాలు అందుకున్న శివకార్తికేయన్.. ఇప్పుడు ''ప్రిన్స్'' తో హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్ - శ్రీ వెంకటేశ్వర సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన ఈ ప్రాజెక్ట్ కోసం హీరోకి మంచి పారితోషకం ఇచ్చినట్లు టాక్. మరి ఈ సినిమా ఈ వారం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
ఇలా ప్రస్తుతం తమిళ స్టార్లతో సినిమాలు చేస్తున్న టాలీవుడ్ నిర్మాతలు అందరూ.. అధిక లాభాలను అంచనా వేసి ఎక్కువ ఇన్వెస్టిమెంట్ పెట్టినట్లుగా ట్రేడ్ టాక్. కానీ బిజినెస్ మాత్రం ఆ స్థాయిలో జరగడం లేదని అంరున్నారు. ఈ చిత్రాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచి మన నిర్మాతలకు లాభాలు తెచ్చిపెడతాయో లేదో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.