Begin typing your search above and press return to search.
పొరుగు `తారామణి` ఇక్కడ వర్కవుటవ్వుద్దా?
By: Tupaki Desk | 19 Aug 2019 3:30 PM GMTతమిళ అనువాదాలు ఇటీవల తెలుగులో ఆశించిన ఫలితాల్ని అందుకోవడంలో చతికిలబడుతున్నాయి. అనువాదాల కంటే స్ట్రెయిట్ సినిమాలకే ఆదరణ అంతకంతకు పెరుగుతోంది. మన కథల్లో కంటెంట్ లో మ్యాటర్ పెరిగిందనడానికి ఇదో సూచిక. నేటివిటీ సినిమాల్లో తంబీలదే పైచేయి అని భావించేవారు ఇప్పుడు అభిప్రాయం మార్చుకోవాల్సి ఉంటుంది.
అయితే తమిళంలో రిలీజై బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించిన `తారామణి` చిత్రం తెలుగులోనూ రిలీజ్ కి వస్తోంది. ఈ చిత్రంలో ఆండ్రియా ప్రధాన నాయిక. అంజలి ఓ కీలక పాత్రను పోషించింది. రామ్ దర్శకత్వంలో జె.ఎస్.కె ఫిలిం కార్పొరేషన్ సమర్పణలొ డి.వి.సినీ క్రియేషన్స్ - లక్ష్మీ వెంకటేశ్వర ఫ్రేమ్స్ సంస్థలు తెలుగులో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. సెప్టెంబర్ 6న రిలీజ్ అంటూ ప్రకటించారు. ఇదో ముక్కోణ ప్రేమకథా చిత్రం. ఎమోషనల్ కంటెంట్ తో పాటు అన్ని ఎలిమెంట్స్ సమపాళ్లలో ఉంటాయని ప్రస్తుతం సమాజంలో స్త్రీల ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో సినిమా సాగుతుందని నిర్మాతలు చెబుతున్నారు. యూత్ టెక్నాలజీ మాయలో పడి ఎలా ప్రవర్తిస్తున్నారు. ఎలాంటి ప్రలోభాలకు లోనవుతున్నారు. దాని పర్యవసానం ఏమిటి? అన్నది చూపిస్తున్నారట.
కథాంశం పరంగా ఇదేమీ కొత్త కాదు కానీ.. ఆండ్రియా.. అంజలి పెర్ఫామెన్సెస్ సినిమాకే హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు. అయితే ఈ సినిమా ఈపాటికే రావాల్సినది. వస్తోంది అంటూ చాలా కాలంగా ప్రచారం సాగుతోంది. కానీ ఇప్పటికి గానీ రిలీజ్ చేయలేకపోతున్నారు ఎందుకనో. `సాహో` లాంటి భారీ చిత్రం రిలీజైన తర్వాత బరిలో దిగుతోంది. మరి తారామణి ఏ మేరకు జనాల్ని థియేటర్లకు రప్పిస్తుందో చూడాలి.