Begin typing your search above and press return to search.
#RC15 థమన్ శంకర్ హైట్స్ ని అందుకోగలడా?
By: Tupaki Desk | 17 July 2022 12:30 AM GMT#ఆర్ సీ 15 (రామ్ చరణ్)-శంకర్ కాంబినేషన్ లో ఓ చిత్రం భారీ అంచనాల మధ్య తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. భారీ కాన్సా స్ పై చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శంకర్ లాంటి దిగ్గజం చేతుల్లో చరణ్ పడటంతో? అభిమానుల అంచనాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. టాలీవుడ్ సినీ చరిత్రను తిరగ రాసే సినిమా అవుతుందని అంచనాలున్నాయి.
నిర్మాణ పరంగా దిల్ రాజు ఏమాత్రం తగ్గడం లేదు. కోట్ల రూపాయల డబ్బుని మంచి నీళ్లలా ఖర్చు చేస్తున్నారు. సినిమా ప్రారంభానికి ముందు శంకర్ రేంజ్ ని దిల్ రాజ్ అందుకోలడా? అని సందేహాలు వ్యక్తమైనా వాటన్నింటిని రాజుగారు పటాపంచ్ లు చేసి తన రేంజ్ ని చూపిస్తున్నారు. చరణ్..శంకర్..దిల్ రాజు ఇలా ముగ్గురు తమ బాధ్యతల్ని పక్కాగా నిర్వర్తిసున్నారు! అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. థమన్ కి సక్సెస్ ఫుల్ ట్రాక్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతున్నాడు. స్టార్ హీరోలందరికీ అతనే సంగీతం అందిస్తున్నాడు. పట్టిన ప్రాజెక్ట్ బంగారమే అవుతుంది. మ్యూజికల్ గా హిట్లు మీద హిట్లు అందుకుని తన రేంజ్..స్పాన్ ని పెంచుకుంటూ పోతున్నాడు. టాలీవుడ్ లో తనకు తానే పోటీ అంటూ దూసుకుపోతున్నాడు.
మరి థమన్ ఆర్ సీ 15 విషయంలో శంకర్ హైట్స్ ని అందుకోలడా? అన్న ఓ ప్రశ్న రెయిజ్ అవుతోందిప్పుడు. తొలిసారి శంకర్ థమన్ తో పనిచేస్తున్నారు. థమన్ అతనికి కొత్త మ్యూజిక్ డైరెక్టర్ . శంకర్ తో సినిమా అంటే అన్ని విభాగాల్లోనూ ఇన్వాల్వ్ అవుతారు . ముఖ్యంగా సంగీతం..నేపథ్య సంగీతం ఇలా ఉండాలి అని ఓ ఐడియా..ఓ విజన్ ముందే హిట్ రూపంలో ఇచ్చేస్తారు.
దాన్ని అల్లుకుని ముందుకు వెళ్లిపోవడమే సంగీత దర్శకుల పని. ఇప్పటివరకూ శంకర్ కి చిత్రాలకి ఎక్కువగా సంగీతం అందించింది ఏ.ఆర్ రెహమాన్...హ్యారిస్ జైరాజ్ మాత్రమే. శంకర్ సినిమాలకు వాళ్లిద్దరే ఎక్కువగా పనిచేసారు. శంకర్ విజన్ ని పట్టుకున్న సంగీత దిగ్గజాలు కాబట్టి ఆ కాంబినేషన్స్ ఫెయిల్ అవ్వలేదు.
మ్యూజికల్ గా ఆ కాంబినేషన్స్ అంచనాల్ని మించే సంగీతం అందించారు. రిలీజ్ కి ముందే సంగీత పరంగా సంచలనం సృష్టించడం వాళ్లిద్దరికీ నల్లేరు మీద నడకలాంటింది. మరి థమన్ ఆ రేంజ్ లో మ్యూజిక్ అందిస్తాడా? శంకర్ హైట్స్ ని అందుకోలడా? అన్నది చూడాలి. అయితే థమన్ నేపథ్య సంగీతంలో ఓ బ్రాండ్ గా ఇప్పటికే వెలిగిపోతున్న సంగతి తెలిసిందే.