Begin typing your search above and press return to search.

చైనా వాళ్లు మన బేబీని మళ్ళీ చూస్తారా ?

By:  Tupaki Desk   |   15 July 2019 10:17 AM GMT
చైనా వాళ్లు మన బేబీని మళ్ళీ చూస్తారా ?
X
సమంతా అంతా తానై నటించిన ఓ బేబీ హ్యాపీగా బాక్స్ ఆఫీస్ రన్ ని కొనసాగిస్తోంది. కనీస పోటీనిచ్చే సినిమాలు రాకపోవడం ఊహించినట్టే ఫ్యామిలీ ఆడియన్స్ ఓట్లు దీనికే పడటం ప్లస్ గా నిలిచింది. ఇప్పుడీ బేబీ కన్ను ఇతర బాషల మీద పడింది. కన్నడ తమిళ మలయాళంలో డబ్బింగ్ రూపంలో విడుదల చేసేందుకు అంతా రెడీ చేశారు. దీని తాలూకు వ్యవహారాలు సురేష్ బాబు రానాలు దగ్గరుండి మరీ చూసుకుంటున్నట్టు సమాచారం. హిందీ రీమేక్ కోసం చర్చలు జరుగుతున్నాయి. ఎవరితో చేయించాలనే డిస్కషన్లు పలువురు దర్శకులతో జరుపుతున్నట్టు వినికిడి.

త్వరలో దీనికి సంబంధించిన ప్రకటన రావొచ్చు. డబ్బింగ్ చేస్తే వచ్చే రెస్పాన్స్ కంటే హిందీలో రీమేక్ చేస్తేనే లాభం. అందుకే ఆ కోణంలో ప్లాన్ చేస్తున్నట్టుగా తెలిసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దీన్ని చైనాలో కూడా రిలీజ్ చేసే ఆలోచనలో సురేష్ బాబు ఉన్నట్టు మరో న్యూస్ వస్తోంది. కానీ చైనాలో మిస్ గ్రానీ గతంలోనే రిలీజై బ్రహ్మాండంగా హిట్ అయ్యింది. ఇప్పుడు అదే కథను కొద్దిగా మార్చి తెలుగులో తీసి మళ్ళీ చైనాలో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తే చూస్తారా అనేది అనుమానమే. అసలు సురేష్ చైనా డబ్బింగ్ కొన్నారో లేదో కూడా క్లారిటీ లేదు.

చైనాలో ఈ మధ్య ఎమోషనల్ ఇండియన్ మూవీస్ కి పట్టం కడుతున్నారు. అలా అని అన్ని ఆడుతున్నాయని కాదు కానీ అమీర్ ఖాన్ ఇప్పటికే తన మార్కెట్ ని అక్కడ స్ట్రాంగ్ గా మార్చుకున్నాడు. హిందీ మీడియం లాంటి చిన్న సినిమా సైతం వందల కోట్లు తెచ్చింది. మరి ఆల్రెడీ ఒరిజినల్ చూసిన చైనా ప్రేక్షకులు ఓ బేబీని రిసీవ్ చేసుకుంటారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది