Begin typing your search above and press return to search.
'ఎఫ్ 3' ఓటీటీ రిలీజ్ డేట్ ని రీషెడ్యూల్ చేస్తారా..?
By: Tupaki Desk | 17 Jun 2022 5:30 AM GMTడిజిటల్ వేదికల సందడి మొదలైన తర్వాత ఏ సినిమా థియేటర్స్ లో వచ్చిన నెలరోజుల్లోనే ఓటీటీల్లో ప్రత్యక్షం అవుతున్నాయి. ఇటీవల కాలంలో కొన్ని సినిమాలైతే మరీ రెండు వారాలకే ఓటీటీ బాట పట్టాయి. చిరంజీవి - ప్రభాస్ - మహేష్ బాబు - అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలు నటించిన చిత్రాలు కూడా నెల రోజులు తిరక్కుండానే డిజిటల్ వేదికల మీదకు వచ్చేశాయి.
‘ఆర్.ఆర్.ఆర్’ వంటి భారీ చిత్రం 50 రోజులకు ఓటీటీలో విడుదల అయింది. 'పుష్ప: ది రైజ్' 'రాధేశ్యామ్' 'ఆచార్య' వంటి సినిమాలు మూడు వారాల్లోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కాబడ్డాయి. 'సర్కారు వారి పాట' మూవీ సైతం పే పర్ వ్యూ రెంటల్ విధానంలో 21 రోజులకే డిజిటల్ రిలీజ్ అయింది. ఈ నేపథ్యంలో 'ఎఫ్ 3' సినిమా కూడా మూడు లేదా నాలుగు వారాల్లో ఓటీటీలో వస్తుందంటూ ఆ మధ్య వార్తలు వచ్చాయి.
అయితే 'ఎఫ్ 3' సినిమా నాలుగు వారాల్లో ఓటీటీకి రాదని.. ఎనిమిది వారాల తర్వాతే వస్తుందని దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపారు. అంటే రెండు నెలల తర్వాతే ఈ ఫన్ ఫ్రాంచైజీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని క్లారిటీ వచ్చింది. కానీ ఇప్పుడు మరోసారి ఈ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి వార్తలు వస్తున్నాయి.
విక్టరీ వెంకటేష్ - వరుణ్ తేజ్ హీరోలుగా దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కిన ''ఎఫ్ 3'' సినిమా మూడు వారాల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది. ఫస్ట్ వీకెండ్ లో మంచి వసూళ్లనే రాబట్టినప్పటికీ.. అవి క్రమ క్రమంగా తగ్గుతూ వచ్చాయి. ఈరోజు శుక్రవారం కొత్త సినిమాలు విడుదలైన తరుణంలో 'ఎఫ్ 3' దాదాపు థియేటర్లలో నుంచి వెళ్లిపోయే పరిస్థితి వచ్చింది.
ఈ నేపథ్యంలో ''ఎఫ్ 3'' సినిమాని ముందుగానే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసే అవకాశం ఉందనే టాక్ నడుస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా డిజిటల్ రైట్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఓటీటీ రిలీజ్ డేట్ ని రీషెడ్యూల్ చేయడానికి దిల్ రాజు కు ప్రైమ్ వీడియో 8 కోట్లను ఆఫర్ చేస్తోందట.
ఒకవేళ స్టార్ ప్రొడ్యూసర్ ఈ డీల్ కు అంగీకరిస్తే.. ఇటీవల స్ట్రీమింగ్ అయిన సినిమాల మాదిరిగానే 'ఎఫ్ 3' కూడా ముందుగనే డిజిటల్ వేదిక మీదకు వచ్చే అవకాశం ఉంది. మరి త్వరలోనే ఈ మల్టీస్టారర్ ఓటీటీ విడుదల పై స్పష్టత వస్తుందేమో చూడాలి.
కాగా, 'ఎఫ్ 3' సినిమాలో వెంకటేష్ సరసన తమన్నా భాటియా.. వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ కౌర్ హీరోయిన్లుగా నటించారు. సోనాల్ చౌహాన్ ప్రత్యేక పాత్రలో కనిపించగా.. పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేసింది. సునీల్ - వెన్నెల కిషోర్ - రాజేంద్ర ప్రసాద్ - మురళీ శర్మ - అలీ ఇతర పాత్రలు పోషించారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు.