Begin typing your search above and press return to search.
'వకీల్ సాబ్'తో ఆ హీరోయిన్ కెరీర్ మలుపు తిరుగుతుందా..??
By: Tupaki Desk | 11 March 2021 9:04 PM ISTటాలీవుడ్ యంగ్ హీరోయిన్ నివేదా థామస్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా తెలుగు కుర్రకారుకు నివేదా ఫేవరేట్ లిస్టులో ఒకటి. అయితే తమిళనాడులో పుట్టిపెరిగిన నివేదా విద్యాభ్యాసం మొత్తం అక్కడే పూర్తిచేసింది. 2016లో 'జెంటిల్ మెన్' సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన నివేదా.. ఫస్ట్ సినిమాతోనే మంచి హిట్ అందుకుంది. ఆ సినిమా హిట్ అవ్వడంతో అవకాశాలు చేజిక్కించుకొని తనకు సూట్ అయ్యే క్యారెక్టర్స్ మాత్రమే చేస్తూ వెళ్తోంది. ఇక 2017లో నిన్నుకోరి, జైలవకుశ సినిమాలతో పాటు 118, బ్రోచేవారెవరురా, దర్బార్ సినిమాలతో మంచిహిట్స్ ఖాతాలో వేసుకుంది. కానీ ఇప్పటికి వరుస సినిమాలతో బిజీ కాలేకపోతుంది నివేదా.
గతేడాది నాని, సుధీర్ బాబులతో కలిసి వి సినిమాలో నటించింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మోస్తారు విజయం అందుకుంది. కానీ అవకాశాలు మాత్రం పెద్దగా తేలేకపోయింది. ప్రస్తుతం నివేదా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ-ఎంట్రీ ఇవ్వనున్న వకీల్ సాబ్ సినిమాలో నటించింది. ఆ సినిమా ఏప్రిల్ 9న థియేట్రికల్ రిలీజ్ అవుతోంది. ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ చేసిన వకీల్ సాబ్ మూవీ పై నివేదా చాలా ఆశలే పెట్టుకుందట. ఈ సినిమాలో నివేదా కీలకపాత్ర పోషించింది. కానీ లీడ్ హీరోయిన్ క్యారెక్టర్ మాత్రం కాదు. ప్రస్తుతం నివేదాకు కావాల్సింది సోలో హీరోయిన్ గా సాలిడ్ హిట్. అయితేనే ఆమె కెరీర్లో ఏదైనా ఊపు కనిపిస్తుందని టాక్. ఎందుకంటే అసలే నివేదా గ్లామర్ పరంగా హద్దులు పెట్టుకుంది. చూడాలి మరి వకీల్ సాబ్ మూవీ నివేదా కెరీర్లో మైలురాయి అవుతుందేమో!