Begin typing your search above and press return to search.
నేచురల్ స్టార్ మూవీ ఆ అపోహను బ్రేక్ చేస్తుందా?
By: Tupaki Desk | 21 April 2022 4:24 AM GMTగడిచిన కొన్ని నెలలుగా టాలీవుడ్ నుంచి వస్తున్న చిత్రాల్లో అత్యధికంగా యాక్షన్ సినిమాలు మాత్రమే బాక్సాఫీస్ వద్ద భారీ విజయాల్ని సాధిస్తున్నాయి. రోమ్ కామ్, రొమాంటిక్ ఎంటర్ టైనర్స్ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావాన్ని చూపించడం లేదు. ఈ నేపథ్యంలో రానున్న నేచురల్ స్టార్ నాని సినిమాపై ప్రస్తుతం ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. వివరాల్లోకి వెళితే.. నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం 'అంటే సుందరానికి'. యంగ్ టాలెంటెడ్ వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించారు.
రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ స్థాయిలో నిర్మించారు. మలయాళ నటి నజ్రియా నజీమ్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంపై మంచి బజ్ క్రియేట్ అయింది. పంచెకట్టుపై టక్ చేసి నాని కనిపించిన తీరు, అతని క్యారెక్టర్ మేకోవర్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. ఈ చిత్రాన్ని జూన్ 10న మూడు భాషల్లో విడుదల చేస్తున్నారు. తెలుగుతో పాటు ఈ మూవీని తమిళ, మలయాళ భాషల్లో విడుదల చేయబోతున్నారు.
ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాల్లో భాగంగా బుధవారం ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని చిత్ర బృందం విడుదల చేసింది. ఫస్ట్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్ర టీజర్ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేస్తోంది. దర్శకుడి డీసెంట్ నేరేషన్ సినిమా పట్ల ప్రేక్షకుల అటెన్షన్ క్రియేట్ అయ్యేలా చేసింది. రొటీన్ ఇంటర్ క్యాస్ట్ లవ్ స్టోరీ నే అయినా దాన్ని దర్శకుడు ప్రజెంట్ చేసిన తీరు ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంటోంది.
ప్రోమో చూస్తుంటే సినిమా కూడా భారీ స్థాయిలో వర్కవుట్ అయ్యేలా కనిపిస్తోంది. యాక్షన్ చిత్రాలకే గత కొంత కాలంగా ప్రేక్షకులు పట్టం కడుతున్న నేపథ్యంలో రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందిన 'అంటే సుందరానికి' చిత్రాన్ని ప్రేక్షకులు కచ్చితంగా ఆదరించి దక్షిణాదిలోని మూడు భాషల్లోనూ బంపర్ హిట్ ని చేస్తారని మేకర్స్ బలంగా నమ్ముతున్నారు. టీజర్ తరహాలోనే సినిమా అంతే అదే టెంపోలో కొనసాగితే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడం గ్యారంటీ అనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇటీవల విడుదలైన 'డీజే టిల్లు' పూర్తి స్థాయిలో ఈ జానర్ కాకపోయినా బాక్సాఫీస్ వద్ద సాంగ్స్ తో దక్కన్ కామెడీతో ఆకట్టుకుని సూపర్ హిట్ అనిపించుకుంది. అదే పంథాలో 'అంలే సుందరానికి' కూడా వర్కవుట్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపసిస్తున్నాయని చెబుతున్నారు.
అయితే ప్రమోషన్స్, సాంగ్స్ విషయంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటే నేచురల్ స్టార్ నాని రొమాంటిక్ కామెడీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాల్ని దక్కించుకోవనే అపోహకు బ్రేక్ చేయడం ఖాయం అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. మరి ఆ సత్తా ఈ సినిమాకు వుందా? లేదా అన్నది తెలియాలంటే జూన్ 10 వరకు వేచి చూడాల్సిందే.