Begin typing your search above and press return to search.

అంతిమంగా ఆస్కార్ కొల్ల‌గొడుతుందా?

By:  Tupaki Desk   |   20 Sep 2022 4:31 AM GMT
అంతిమంగా ఆస్కార్ కొల్ల‌గొడుతుందా?
X
2023 మార్చిలో ఆస్కార్ అవార్డుల వేడుక జ‌ర‌గ‌నుంది. అయితే ఆరు నెల‌ల ముందు నుంచే ప్ర‌తిష్ఠాత్మ‌క‌ పుర‌స్కారాల నామినేష‌న్ల‌కు సంబంధించిన హ‌డావుడి మొద‌ల‌వుతుంది. ఇప్ప‌టికే ఆస్కార్ అవార్డుల డిబేట్ ప‌రాకాష్ట‌కు చేరుకుంది. దానికి కార‌ణం భార‌తదేశంలో క‌మ‌ర్షియ‌ల్ గా ఘ‌న‌విజ‌యం సాధించిన ఆర్.ఆర్.ఆర్ ని ఆస్కార్ కి ప్ర‌తిపాదించ‌డ‌మే. ల‌గాన్- స్ల‌మ్ డాగ్ మిలియ‌నీర్ త‌ర్వాత అంత‌టి ప్రచారం ద‌క్కుతోంది ఈ మూవీకి.

ప్రతిష్టాత్మకమైన పుర‌స్కారాల‌కు ఇప్పటి నుండి ఆరు నెలల లోపు స‌మ‌యమే మిగిలి ఉంది. అదే క్ర‌మంలో RRRపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఆస్కార్ 2023లో ఉత్తమ చిత్రం -ఉత్తమ స్క్రీన్ ప్లే విభాగంలో RRRని ఎంపిక చేయాలని భారతీయ జ్యూరీపై ఒత్తిడి చేస్తూ విస్తృతంగా సోషల్ మీడియా ప్రచారం జరుగుతోంది. భారతీయ జ్యూరీ త్వరలో ఆస్కార్ కు RRR నామినేషన్ పై తుది ప్ర‌క‌ట‌న వెలువ‌రించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.

రాజమౌళి ఇప్పటికే వెస్ట్ లో RRR ని చురుగ్గా ప్రమోట్ చేస్తున్నాడు. అమెరికా కెనడాలో జరిగే ఈ సినిమా ప్రత్యేక ప్రదర్శనలకు ఆయన హాజరవుతున్నారు. అంతే కాదు గుట్టు చ‌ప్పుడు కాకుండా ఆర్.ఆర్.ఆర్ ని రేసులో ముందుంచేందుకు జ‌క్క‌న్న వ్య‌క్తిగ‌తంగా చాలా రిస్కులే చేస్తున్నార‌ని స‌మాచారం. దీనికోసం మేక‌ర్స్ కూడా పెద్ద మొత్తాల‌ను కేటాయించి ప్ర‌చారాన్ని ప్లాన్ చేసార‌నేది ఇన్ సైడ్ టాక్.

ఆర్.ఆర్.ఆర్ చిత్రం భార‌త‌దేశంతో పాటు ప్ర‌పంచ దేశాల్లో విశేష ఆద‌ర‌ణ ద‌క్కించుకుంది. దాదాపు 900 కోట్లు వ‌సూలు చేసింది. ఈ సినిమాని అమెరిక‌న్లు ఆంగ్లేయులు విప‌రీతంగా ఆద‌రించారు. నెట్ ఫ్లిక్స్ లో రిలీజ‌వ్వ‌డంతో గొప్ప రీచ‌బులిటీ ద‌క్కింది. అయితే ఆర్.ఆర్.ఆర్ కి ఆస్కార్ ద‌క్కాలంటే ఎంత ఖ‌ర్చ‌వుతుంది? అన్న విశ్లేష‌ణ‌లు ఇటీవ‌ల వెలువ‌డ్డాయి. ఈ సినిమాకి ప్ర‌చారం చాలా చాలా అవ‌స‌రం. దానికోసం క‌నీసం 5 మిలియ‌న్ డాల‌ర్లు అయినా ఖ‌ర్చు చేయాల్సి ఉంటుంద‌ని చెబుతున్నారు. గ‌తంలో ఆస్కార్ లు అందుకున్న ప‌లు చిత్రాల ప్ర‌చారం కోసం ఇంత పెద్ద మొత్తం ఖ‌ర్చు చేసార‌ని అన‌లిస్టులు చెబుతున్నారు. 5 మిలియ‌న్లు అంటే దాదాపు 40కోట్లు పైమాటే. అంత పెద్ద మొత్తాన్ని ఖ‌ర్చు చేసి రాజ‌మౌళి బృందం ఆర్.ఆర్.ఆర్ కి ప్ర‌చారం చేస్తుందా? అన్న‌దే ఇప్పుడు అంద‌రి సందేహం. అయితే ఆస్కార్ లాంటి వేదికపై ఆర్.ఆర్.ఆర్ మెరుపులు మెరిపిస్తే అది తెలుగు జాతికి గ‌ర్వ‌కార‌ణం అవుతుంది. దానికోసం ప్ర‌య‌త్నం జ‌రుగుతుంద‌నే ఆశిస్తున్నారు.

2020 సంవత్సరానికి గాను ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకున్న పారాసైట్ మేకర్స్ ఆస్కార్ ప్రచారం కోసం సుమారు 5 మిలియన్ డాల‌ర్లు ఖర్చు చేసినట్లు గతంలో క‌థ‌నాలొచ్చాయి. ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ టీమ్ కూడా అంత పెద్ద మొత్తాన్ని వెచ్చిస్తోందా? అన్న‌దానికి స‌మాచారం లేదు.

బాహుబ‌లి ఫ్రాంఛైజీ సినిమాల కంటే ఆర్.ఆర్.ఆర్ ఎంతో ఉన్న‌త‌మైన‌ద‌ని ఆస్కార్ అవార్డు గెలుచుకోవ‌డం ఖాయ‌మ‌ని విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. జాన‌ప‌ద కేట‌గిరీలో ఇది అద్భుత‌మైన ప్ర‌య‌త్న‌మ‌ని కూడా ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ముఖ్యంగా విదేశీయులు ఆర్.ఆర్.ఆర్ కి ఆస్కార్ ఇవ్వాల‌ని కోరుకుంటున్నారంటే దాని ప్ర‌భావం ఏ రేంజులో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. కానీ ఈసారి ఈ ప్ర‌య‌త్నం వృధా కాకూడ‌ద‌ని భావిద్దాం.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.