Begin typing your search above and press return to search.
'ఆదిపురుష్' వాయిదా ఎఫెక్ట్ 'సలార్' పై పడుతుందా..?
By: Tupaki Desk | 7 Nov 2022 2:30 PM GMT2022 లో 'రాధే శ్యామ్' సినిమాతో ప్లాప్ మూటగట్టుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. బ్లాక్ బస్టర్ హిట్టుతో 2023 ఏడాదిని ఘనంగా ప్రారంభించాలని అనుకున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ''ఆదిపురుష్'' చిత్రాన్ని వచ్చే సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోందని ప్రకటన కూడా ఇచ్చారు. అయితే ఈ చిత్రం వాయిదా పడటంతో ప్రభాస్ నటించే మిగతా సినిమాలు ముందుకు వెళ్లే అవకాశం ఉందనే చర్చ మొదలైంది.
ప్రభాస్ లైనప్ లో పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్' వంటి హై ఆక్టేన్ యాక్షన్ మూవీలో నటిస్తున్నాడు. అలానే మారుతి డైరెక్షన్ లో ఓ చిత్రాన్ని డార్లింగ్ సెట్స్ మీదకు తీసుకొచ్చారు. వీటితో పాటుగా నాగ్ అశ్విన్ తో కలిసి 'ప్రాజెక్ట్ K' అనే పాన్ ఇంటెర్నేషన్ ఫిలిం చేస్తున్నాడు. 'ఆదిపురుష్' చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ చేసి, 'సలార్' సినిమాని 2023 సెప్టెంబర్ 28న విడుదల చేసేలా ప్లాన్ చేసుకున్నారు.
'ప్రాజెక్ట్ కె' సినిమాని 2024 దసరా సీజన్ లో లేదా 2025 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ గ్యాప్ లో టైం చూసుకొని మారుతి చిత్రాన్ని థియేటర్లలోకి వదలాలని అనుకున్నారు. అయితే ఇప్పుడు 'ఆదిపురుష్' వాయిదా పడటంతో ప్రభాస్ మిగతా సినిమాల రిలీజుల్లో కూడా మార్పులు ఉండనున్నాయని టాక్ నడుస్తోంది.
సాధారణంగా స్టార్ హీరోలు ఒకేసారి పలు ప్రాజెక్ట్‌లలో నటిస్తున్నప్పుడు.. వాటిల్లో ఒకదాని ప్లానింగ్ లో చిన్న మార్పు జరిగినా మిగతా వాటిపై ప్రభావం చూపుతుంది. అది షూటింగ్ అయినా.. విడుదలైనా సరే మార్పులు చోటుచేసుకుంటాయి. ప్రభాస్ రెండు మూడు చిత్రాలను ఒకేసారి సెట్స్ మీదకు తీసుకురావడం వల్ల 'రాధే శ్యామ్' సినిమా ఆలస్యమవుతూ వచ్చింది.
'ఆదిపురుష్' చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్న తర్వాత 'సలార్' సినిమాని 2023 ఏప్రిల్ 14 నుండి సెప్టెంబర్ 28వ తేదీకి మార్చారు. అయితే ఇప్పుడు 'ఆదిపురుష్' ను జూన్ 16వ తేదీకి పోస్ట్ పోన్ చేసారు. ఈ నేపథ్యంలో 'సలార్' నిర్మాతలు కూడా తమ సినిమా విడుదల వాయిదా వేయడానికి మరొక తేదీని పరిశీలించే ఛాన్స్ ఉందని.. 2024 సంక్రాంతికి రావొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ప్రభాస్ గత చిత్రాలు కరోనా పాండమిక్ కారణంగా లేట్ అయ్యాయి. షూటింగ్ అనుకున్న ప్రకారం జరగకపోవడంతో విడుదల తేదీల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. ఆల్రెడీ డార్లింగ్ 'ఆదిపురుష్' చిత్రీకరణ పూర్తి చేసాడు. కేవలం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మరింత మెరుగ్గా చేయడానికే చిత్ర బృందం ఐదు నెలలు అదనంగా సమయం తీసుకుంటున్నారు.
కాబట్టి ప్రభాస్ ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారమే 'సలార్' - 'ప్రాజెక్ట్ K' మరియు మారుతి సినిమాల షూటింగ్ లలో పాల్గొనవచ్చు. అందులోనూ 'ఆదిపురుష్' మరియు 'సలార్' సినిమాల కొత్త విడుదల తేదీల మధ్య దాదాపు మూడున్నర నెలల సమయం ఉంది. దీన్ని బట్టి చూస్తే ముందుగా అనుకున్న విధంగానే యంగ్ రెబల్ స్టార్ నుంచి వచ్చే ఏడాది రెండు పాన్ ఇండియా చిత్రాలు రిలీజ్ అవుతాయి.
ఇక 'ప్రాజెక్ట్ K' సినిమా కంప్లీట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది కాబట్టి.. మారుతి చిత్రాన్ని కూడా ప్రభాస్ ముందుగానే పూర్తి చేసే అవకాశం ఉంది. 'సలార్' అనుకున్న తేదీకే వస్తే.. 2023 సంక్రాంతికి 'రాజా డీలక్స్' పేరుతో ప్రచారం చేయబడుతున్న మారుతి చిత్రం రావొచ్చు. ఈ విధంగా చూస్తే 'ఆదిపురుష్' వాయిదా ఎఫెక్ట్ ప్రభాస్ మిగతా సినిమాల మీద పడే అవకాశమే లేదని చెప్పాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.