Begin typing your search above and press return to search.
'లవ్ స్టోరీ' రిలీజ్ డేట్ మళ్లీ మారనుందా..?
By: Tupaki Desk | 24 Aug 2021 5:30 PM GMTశేఖర్ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య - సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన తాజా చిత్రం ''లవ్ స్టోరీ''. సమ్మర్ లో రిలీజ్ చేయాలనుకున్న ఈ చిత్రాన్ని కోవిడ్ నేపథ్యంలో వాయిదా వేశారు. ఇప్పుడు థియేటర్లు తెరుచుకోవడంతో వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ ని మరోసారి మార్చే అవకాశం ఉందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
'లవ్ స్టోరీ' చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ చేస్తున్న రోజునే ఓటీటీ సంస్థలు తమ సినిమాలని స్ట్రీమింగ్ పెట్టడానికి రెడీ అవుతున్నాయి. నాని 'టక్ జగదీష్' సినిమాని అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చే నెల 10న విడుదల
చేయాలని చూస్తున్నారు. అలానే నితిన్ 'మాస్ట్రో' చిత్రాన్ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో సెప్టెంబర్ 9న రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. వీటికి తోడు కంగనా రనౌత్ 'తలైవి' చిత్రం వినాయక చవితి సంధర్భంగా థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో 'లవ్ స్టోరీ' నిర్మాతలు వెనక్కి తగ్గే అవకాశం ఉందని అంటున్నారు.
నాగ చైతన్య సినిమాని సెప్టెంబర్ 17కు పోస్ట్ పోన్ చేయనున్నారని.. ఒకవేళ ఓటీటీ సంస్థలు స్ట్రీమింగ్ వాయిదా వేసుకుంటే మాత్రం చెప్పిన సమయానికి రిలీజ్ చేసే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది. 'లవ్ స్టోరీ' చిత్రం ఎప్పుడు విడుదలైనా, పాండమిక్ సెకండ్ వేవ్ తర్వాత థియేటర్ లలో విడుదలవుతున్న ఫస్ట్ ప్రెస్టీజియస్ మూవీ ఇదే అవుతుంది. ఈ సినిమా ఎగ్జిబిషన్ సెక్టార్ లో నూతనోత్సాహం నింపబోతోందని అందరూ నమ్ముతున్నారు.
'లవ్ స్టొరీ' సినిమాపై సినీ అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. దీనికి తగ్గట్లుగానే ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - పాటలు విశేష స్పందన తెచ్చుకున్నాయి. ముఖ్యంగా ఈ చిత్రంలోని సాంగ్స్ యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ తో రికార్డులు తిరగరాస్తున్నాయి. ఈ చిత్రాన్ని సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ - అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. కె నారాయణదాస్ నారంగ్ - పి. రామ్మోహన్ రావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.