Begin typing your search above and press return to search.
RRR రిలీజ్ డేట్ మారుతుందా..? ఛాన్స్ ఉందంటగా..!
By: Tupaki Desk | 26 Jan 2021 1:30 AM GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ మూవీ RRR. ఈ సినిమాపై అటు అభిమానుల్లో ఇటు ప్రేక్షకుల్లో అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో చెప్పాల్సిన పనిలేదు. ఈ మూవీ కోసం చెర్రీ, తారక్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రెండు సార్లు వాయిదా పడిన ఈ సినిమా రిలీజ్ డేట్ ను మూడోసారి ప్రకటించడంతో.. అభిమానుల ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. అయితే.. ఈ డేట్ కూడా మారే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతుండడంతో ఆందోళనకు గురవుతున్నారు ఫ్యాన్స్.
వాస్తవంగా.. సినిమాలో విషయం ఉండాలేగానీ ఎప్పుడు రిలీజ్ చేసిన హిట్ అవుతుంది. కానీ.. కలెక్షన్స్ పరంగా సత్తా చాటాలంటే మాత్రం.. సమయం, సందర్భం తప్పక చూసుకోవాల్సిందే. నిర్మాత గల్లా పెట్టె నిండడంలో సీజన్ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అందుకే పెద్ద సినిమాలు అలస్యమయినా కూడా సరైన సమయం కోసం ఎదురుచూస్తుంటాయి.
RRR కేవలం తెలుగులోనే కాదు.. మొత్తం ఐదు భాషల్లో రిలీజ్ కాబోతోంది. వరల్డ్ వైడ్ గా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. సో.. రిలీజ్ డేట్ అనేది అన్ని భాషలనూ దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని ఈ సినిమాను 2020 జూలై 31న రిలీజ్ చేయాలని అనుకున్నారు మేకర్స్. అయితే.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కు సమయం సరిపోదని రిలీజ్ డేట్ ను 2021 జనవరి 8కి పోస్ట్ పోన్ చేశారు.
కానీ.. ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. కరోనా కారణంగా రిలీజ్ మళ్లీ వాయిదా వేయక తప్పలేదు. ఈ క్రమంలో ఎప్పుడు విడుదలవుతుంది అనే విషయంలో రకరకాల రూమర్స్ వచ్చాయి. అయితే.. వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ.. అక్టోబర్ 13న సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నట్లు అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చారు మేకర్స్. దీంతో.. అందరి సందేహాలూ తీరిపోయాయి.
అయితే.. ఈ రిలీజ్ డేట్.. సినిమా బిజినెస్ లో కీలకమైన డిస్ట్రిబ్యూటర్స్ కు నచ్చలేదట. RRR రిలీజ్ డేట్ పై వారు చాలా సంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుత డేట్ దసరా టైమ్ ను దృష్టిలో పెట్టుకొని ఫిక్స్ చేశారు. ఈ సమయంలో కూడా కలెక్షన్స్ బాగానే వస్తాయి. కానీ.. సంక్రాంతి సీజన్ అయితే ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుందని ఇండస్ట్రీలో నమ్మకం. దాదాపు 450కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాకు.. సంక్రాంతి సీజన్ అయితేనే బాగుంటుందని భావిస్తున్నారట పంపిణీదారులు.
నిజానికి సంక్రాంతి సీజన్ లో జస్ట్ యవరేజ్ టాక్ వచ్చిన సినిమాలు కూడా ఈజీగా ప్రాఫిట్ లోకి వస్తాయి. అలాంటిది.. RRR లాంటి హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్న సినిమా.. పొంగల్ బరిలో దిగితేనే మరిన్ని లాభాలు సాధిస్తుందని వారు అభిప్రాయ పడుతున్నారట. ఈ విషయంపై చర్చించడానికి డిస్ట్రిబ్యూటర్లంతా త్వరలో నిర్మాతను కలవనున్నట్లు తెలుస్తోంది. సినిమాను 2022 సంక్రాంతి వాయిదా వేయాలని వారంతా కోరనున్నట్టు సమాచారం. మరి, ఈ విషయంలో రాజమౌళి ఏం చేస్తారు? అన్నదే ఇప్పుడు అందరినీ తొలుస్తున్న ప్రశ్న.