Begin typing your search above and press return to search.
బిబి3 కి అదే టైటిల్ ను ఖరారు చేయనున్నారా?
By: Tupaki Desk | 1 Nov 2020 8:10 AM GMTనందమూరి బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీనుల కాంబోలో రాబోతున్న మూవీ టైటిల్ విషయంలో చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. చాలా టైటిల్స్ ను పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. వాటిలో సూపర్ హీరో మరియు మోనార్క్ టైటిల్స్ ఎక్కువగా ప్రచారం జరిగింది. సూపర్ హీరో టైటిల్ వల్ల నెగటివిటీ వచ్చే అవకాశం ఉందని భావించారట. ఆ తర్వాత మోనార్క్ కు కూడా కొంత నెగటివ్ ఫీడ్ బ్యాక్ రావడంతో కొత్త టైటిల్ ను వెదికే పనిలో పడ్డారు. ఇన్ని రోజులు అనేక టైటిల్స్ ను పరిశీలించి చర్చించిన తర్వాత చివరకు మళ్లీ మోనార్క్ గురించే ఆలోచనలో పడ్డారట.
గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన సింహా మరియు లెజెండ్ సినిమాల సెంటిమెంట్ ను ఫాలో అయ్యి ఈ సినిమాను కూడా రూపొందిస్తున్నారు. అందుకే టైటిల్ విషయంలో కూడా లెజెండ్ సెంటిమెంట్ ను ఫాలో అవ్వాలని భావిస్తున్నారు. మూడు అక్షరాలతో పాటు తెలుగు కాని పదాన్ని లెజెండ్ గా ఖరారు చేశారు. ఇప్పుడు అదే సెంటిమెంట్ తో మోనార్క్ ను ఖరారు చేసే విషయంలో యూనిట్ సభ్యులు చర్చలు జరుపుతున్నారు.
మోనార్క్ టైటిల్ వల్ల ఖచ్చితంగా సినిమా గురించి జనాల్లో చర్చ జరగడంతో పాటు టైటిల్ చాలా క్యాచీగా ఉండటం వల్ల పబ్లిసిటీకి కూడా బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని రోజుల్లో షూటింగ్ పునః ప్రారంభంకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో టైటిల్ విషయంలో తుది నిర్ణయం తీసుకుని షూటింగ్ మొదలు అయిన వెంటనే పోస్టర్ లేదా టీజర్ ను విడుదల చేయాలని భావిస్తున్నారట. సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ చివరి వరకు విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.