Begin typing your search above and press return to search.
యువ హీరో పాదయాత్రతో పని అవుద్దా..??
By: Tupaki Desk | 13 Sep 2022 7:37 AM GMTయంగ్ హీరో నాగశౌర్య నటించిన లేటెస్ట్ మూవీ "కృష్ణ వ్రింద విహారి". అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శౌర్య హోమ్ ప్రొడక్షన్ ఐరా క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మించారు. యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ గా రూపొందిన ఈ సినిమా రిలీజ్ కు రెడీ అయింది.
'కృష్ణ వ్రింద విహారి' చిత్రాన్ని సెప్టెంబర్ 23న థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే బయటకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో నాగశౌర్య సరికొత్త ప్రమోషనల్ స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నాడు.
ప్రమోషనల్ టూర్లు - కాలేజీ విజిట్స్ వంటి రెగ్యులర్ పబ్లిసిటీ ఫార్మాట్ కు భిన్నంగా.. 'కృష్ణ వ్రింద విహారి' కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్ర చేయాలని శౌర్య ప్లాన్ చేసుకున్నాడు. ముందుగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన నగరాల్లో తిరగనున్నట్లు పాదయాత్ర షెడ్యూల్ ను ఈరోజు మంగళవారం అధికారికంగా ప్రకటించారు.
KVV టీమ్ సెప్టెంబర్ 14న తిరుపతి నగరంలో పాదయాత్ర చేయనుంది. ఆ తర్వాత ఈ నెల 15వ తేదీన నెల్లూరు మరియు ఒంగోలు.. 16న విజయవాడ - గుంటూరు - ఏలూరులను సందర్శించనున్నారు. సెప్టెంబర్ 17న భీమవరం - రాజమండ్రి.. 18న కాకినాడ - వైజాగ్ నగరాల్లో శర్వా పాదయాత్ర చేయనున్నట్లు తెలిపారు.
మామూలుగా రాజకీయ నాయకులు జనాలకు చేరువ అవ్వడానికి పాదయాత్ర చేస్తుంటారు. అనేకమంది లీడర్స్ ఈ విధంగా వచ్చిన మైలేజ్ తోనే అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు నాగశౌర్య కూడా తన సినిమా కోసం రాజకీయ ప్రచారాస్త్రాన్ని ఉపయోగిస్తున్నాడు. పొలిటీషియన్స్ మాదిరిగా పాదయాత్ర చేయనున్నాడు.
పాదయాత్ర ద్వారా జనాలతో ఇంట్రాక్ట్ అవుతూ మూవీ ప్రమోషన్స్ చేయనున్నారు. కాకపోతే ఇక్కడ శౌర్య అనుమతులు తీసుకున్న సిటీలలో మాత్రమే చేస్తాడు. ఇక హీరోహీరోయిన్లను చూడటానికి జనాలు ఎగబడతారు కాబట్టి.. వారితో కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ నడవనున్నారు.
సినిమా పబ్లిసిటీ కోసం శౌర్య వెరైటీ ఐడియాలతో వెళ్లడం బాగానే ఉంది. అయితే ఇది ఏ మేరకు వర్కవుట్ అవుతుంది.. దీని ద్వారా సినిమా ప్రేక్షకులకు రీచ్ అవుద్దా లేదా.. ఇది సినిమాకు ప్లస్ అవుతుందా అనేది వేచి చూడాలి. ఒకవేళ ఈ 'పాదయాత్ర' కాన్సెప్ట్ పనిచేస్తే మాత్రం.. మిగతా హీరోలంతా ఇదే దారిలో నడుస్తారేమో?.
గతేడాది నాగశౌర్య నటించిన 'లక్ష్య' 'వరుడు కావలెను' వంటి సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి. దీంతో ఇప్పుడు సొంత బ్యానర్ లో రూపొందిన "కృష్ణ వ్రింద విహారి" మూవీపైనే బోలెడన్ని ఆశలు పెట్టుకున్నాడు.
ఇందులో నాగశౌర్య ఒక బ్రాహ్మణ యువకుడిగా కనిపించనున్నాడు. అతనికి జోడీగా షిర్లీ సెటియా హీరోయిన్ గా నటించింది. రాధిక శరత్ కుమార్ కీలక పాత్ర పోషించగా.. వెన్నెల కిషోర్ - రాహుల్ రామకృష్ణ - సత్య - బ్రహ్మాజీ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.
శంకర్ ప్రసాద్ మల్పూరి సమర్పణలో ఉషా మల్పూరి నిర్మిస్తున్న KVV చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం సమకూర్చారు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించగా.. తమ్మిరాజు ఎడిటింగ్ వర్క్ చేశారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.