Begin typing your search above and press return to search.
క్రిస్మస్ సంక్రాంతి వచ్చేస్తున్నాయ్.. థియేటర్లు తెరుస్తారా?
By: Tupaki Desk | 2 Nov 2020 12:10 PM GMTమహమ్మారీ విలయం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు. అన్ని పరిశ్రమల్లానే సినీపరిశ్రమపైనా తీవ్ర ప్రభావం చూపించింది కరోనా. దాదాపు ఏడు నెలల విరామం తరువాత షూటింగులు తిరిగి ప్రారంభమయ్యాయి. 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లను తిరిగి తెరవడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. చాలామంది నిర్మాతలు జనవరి నాటికి సాధారణ స్థితికి వచ్చేస్తుందని ప్రేక్షకులు సినిమాలు చూడటానికి తిరిగి థియేటర్లకు వస్తారని నమ్మకంగా ఉన్నారు.
రాష్ట్రంలోని థియేటర్లను తిరిగి తెరవడానికి తెలంగాణ ప్రభుత్వం ఇంకా అనుమతి ఇవ్వలేదు. తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్ లో థియేటర్లు తిరిగి తెరవవచ్చని చర్చలు జరుగుతున్నాయి. డిసెంబరులో థియేటర్లు తిరిగి తెరుచుకుంటాయా లేదా..? సంక్రాంతికి విడుదల చేస్తే బాక్సాఫీస్ కలెక్షన్లు దక్కుతాయా లేదా? అంటూ చాలా మంది చిత్రనిర్మాతలు ఇప్పుడు తర్జనభర్జన పడుతున్నారు. 50శాతం ఆక్యుపెన్సీ జనవరిలో అమలు చేయడాన్ని కొనసాగిస్తే అది ఆదాయానికి భారీగా కట్ పెట్టేస్తుంది.
ప్రస్తుతానికి క్రేజీ హీరోల సినిమాల్ని సంక్రాంతి బరిలో దించాలని ప్లాన్ చేస్తున్నారు. వకీల్ సాబ్ - క్రాక్ - రెడ్ వంటి సినిమాలు ప్రస్తుతం రేసులో ఉన్నాయి. జనవరిలో 50 శాతం ఆక్యుపెన్సీతో... చిత్రనిర్మాతలు తమ సినిమాలను విడుదల చేయడంపై పునరాలోచన చేస్తారు. ప్రస్తుతానికి సన్నివేశం ఏమిటి అన్నదానిపై స్పష్టత లేదు. తెలుగు సినీ ప్రముఖులు త్వరలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ను కలుసుకుని థియేటర్లను తిరిగి ప్రారంభించడంపై చర్చించనున్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఓకే అనగానే థియేటర్లను ఓపెన్ చేయనున్నారని తెలుస్తోంది.