Begin typing your search above and press return to search.
తెలంగాణలో థియేటర్లు ఓపెన్ కానున్నాయా?
By: Tupaki Desk | 15 Jun 2021 5:30 AM GMTప్రస్తుతం అమలు చేస్తున్న లాక్ డౌన్ నేపథ్యంలో.. మొన్నటి వరకు మూతపడి ఉన్న మాల్స్ తోపాటు రెస్టారెంట్లు కొన్ని ఓపెన్ అయ్యాయి. ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకులాక్ డౌన్ ను పొడగించిన నేపథ్యంలో ట్రాఫిక్ పెరగటంతో పాటు..వాణిజ్య కార్యకలాపాలు ఊపందుకున్నాయి. ఇదంతా బాగున్నప్పుడు.. థియేటర్లు.. మల్టీఫ్లెక్సులు ఎప్పుడు మొదలవుతాయన్నది ప్రశ్నగా మారింది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ నెల 19 (శనివారం) నుంచి తెలంగాణ వ్యాప్తంగా థియేటర్లు.. మల్టీఫ్లెక్సులు తిరిగి ఓపెన్ అయ్యే వీలుందని చెబుతున్నారు. మొదటి వేవ్ అనంతరం థియేటర్లను ఓపెన్ చేసినప్పుడు ఏ రీతిలో అయితే విధివిధానాల్ని అమలు చేశారో.. అదే తీరులో తాజాగా అమలు చేస్తారని చెబుతున్నారు. సీటు సీటుకు మధ్య గ్యాప్ ఉంచాలని పేర్కొంటూ థియేటర్ల ఓపెన్ కు ఓకే చెప్పొచ్చంటున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య అంతకంతకూ తగ్గుతున్న సంగతి తెలిసిందే. పెరుగుదల 1.5 శాతం కంటే తక్కువగా నమోదు అవుతున్న నేపథ్యంలో.. ఇప్పుడు అమలు చేస్తున్న పది రోజుల లాక్ డౌన్ లోనూ మార్పులు ఉంటాయని చెబుతున్నారు.
ప్రస్తుతం సిక్స్ టు సిక్స్ ను కాస్తా.. సిక్స్ టూ నైన్ వరకు పొడిగిస్తారని.. అదే సమయంలో ఇప్పటికి మూసి ఉన్న థియేటర్లు.. మల్టీఫ్లెక్సులు..జిమ్ లు.. లాంటి వాటిపై ఉన్న పరిమితుల్ని ఎత్తి వేసే అవకాశం ఉందంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.