Begin typing your search above and press return to search.
కన్నడ సెన్సేషన్ మరో పార్ట్ కూడా రానుందా?
By: Tupaki Desk | 19 Oct 2022 5:30 PM GMTరిషబ్ శెట్టి.. కన్నడలో తెలిసిన పేరు. కానీ తెలుగు ప్రేక్షకులకు ఏ మాత్రం పరిచయం లేని పేరిది. అలాంటి హీరో, కమ్ దర్శకుడు తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ `కాంతార`. `కేజీఎఫ్` సిరీస్ చిత్రాలని అందించిన సంచలనం సృష్టించిన హోంబలే ఫిలింస్ బ్యానర్ పై రూ. 16 కోట్ల బడ్జెట్ తో కన్నడలో నిర్మించిన ఈ మూవీ దేశ వ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తూ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లని రాబడుతూ ట్రేడ్ వర్గాలనే విస్మయానికి గురిచేస్తోంది.
ఊహించని విధంగా మౌత్ టాక్ తో మాసీవ్ యుఫోరియాని బాక్సాఫీస్ వద్ద సృష్టిస్తున్న ఈ మూవీ రోజు రోజుకీ వసూళ్ల పరంగా రికార్డులని సొంతం చేసుకుంటూ ఇండస్ట్రీ వర్గాలని షాక్ కు గురిచేస్తోంది. ఇప్పటికే విడుదలైన నాలుగు రోజుల్లో ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ. 20 కోట్లు వసూళ్లని రాబట్టడం ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఈ మధ్య కాలంలో ప్రేక్షకుల్ని మ్యాడ్నెస్ కి గురిచేస్తూ టికెట్ విండో వద్ద సంచలనం సృష్టించిన సినిమా ఏదీ లేకపోవడంతో ఈ సినిమాకు ఇంత క్రేజ్ ఏంటీ అని అంతా ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తున్నారు.
ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ వసూళ్ల పరంగా దూకుడు చూపిస్తోంది. కన్నడ వెర్షన్ ఇప్పటికే వంద కోట్లు వసూళ్లని దాటిన ఈ మూవీ తెలుగు వెర్షన్ లోనూ రికార్డు స్థాయి వసూళ్లని రాబడుతూ టాలీవుడ్ మేకర్స్ తో పాటు ట్రేడ్ వర్గాలనే విస్మయానికి గురిచేస్తోంది. తెలుగు నాట రెండు రోజుల్లోనే రూ. 11 కోట్ల మేర వసూళ్లని రాబట్టిన ఈ మూవీ ఇప్పడు రూ. 20 కోట్లకు చేరడం గమనార్హం.
ఇదిలా వుంటే 1847, 1970, 1990 నేపథ్యంలో సాగే కథతో రూపొందిన ఈ మూవీ ఎండింగ్ లో సీక్వెల్ వున్నట్టుగా చూపించారు. అంతే కాకుండా ప్రీక్వెల్ కి కూడా అవకాశం వుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హీరో, డైరెక్టర్ రిషబ్ శెట్టి ని ఈ విషయమై మీడియా ప్రశ్నిస్తే ఆసక్తికర సమాధానం చెప్పాడు. ప్రస్తుతం ఈ మూవీకి సీక్వెల్, ప్రీక్వెల్ గురించి ఇంకా ఏమీ ఆలోచించడం లేదన్నాడు. అంతే కాకుండా రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకున్న తరువాతే దాని గురించి ఆలోచిస్తానన్నాడు.
ఇదిలా వుంటే తెలుగులో `కాంతార` ఎపిక్ హిట్ గా నిలిచి కేవలం నాలుగు రోజుల్లోనే ఊహించని విధగంఆ వసూళ్లని రాబడుతోంది. `కేజీఎఫ్` వసూళ్లని లాంగ్ రన్ లో `కాంతార` అధిగమించడం ఖాయమని పలువురు విస్మాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేజీఎఫ్ తెలుగులో లాంగ్ రన్ లో రూ. 25 కోట్ల కు పైగా గ్రాస్ ని వసూలు చేసింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.