Begin typing your search above and press return to search.
'పుష్ప' పై స్పైడర్ ఎఫెక్ట్ పడుతుందా..?
By: Tupaki Desk | 17 Nov 2021 8:37 AM GMTస్పైడర్ మ్యాన్ సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి ప్రేక్షకాదరణ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మార్వెల్ సిరీస్ నుండి ఇప్పుడు ''స్పైడర్ మ్యాన్: నో వే హోమ్'' అనే మరో భారీ సినిమా రాబోతోంది. జాన్ వాట్స్ నిర్మించిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.
టామ్ హాలండ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో డాక్టర్ స్ట్రేంజ్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ విశేషంగా అలరించింది. ఈ సినిమా డిసెంబర్ 17న ఇంగ్లీష్ తో పాటుగా తెలుగు తమిళ హిందీ భాషల్లో రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా తెలుగు ట్రైలర్ ను మేకర్స్ ఆవిష్కరించారు.
'స్పైడర్ నన్ను కుట్టినప్పటి నుంచి వారం రోజుల దాకా నా లైఫ్ చాలా నార్మల్ గానే అనిపించింది..' అని పీటర్ చెప్పడంతో ఈ ట్రైలర్ ప్రారభమైంది. గత సిరీస్ లో మంచివాడి ముసుగులో ప్రజల మెప్పు పొందిన విలన్ మిస్టీరియోను స్పైడర్ మ్యాన్ అంతం చేయడంతో.. ప్రజలంతా స్పైడర్ మ్యాన్ ను అంతా శత్రువులా చూస్తారు. అంతేకాదు పీటర్ పార్కరే స్పైడర్ మ్యాన్ అని ప్రపంచానికి తెలిసిపోవడంతో మరిన్ని సమస్యలు ఎదురైనట్లు ‘నో వే హోమ్’ సీరిస్ లో చూపిస్తున్నారు.
పీటర్ పార్కర్ ఈ సమస్యల నుంచి తనను బయటపడేయాలంటూ డాక్టర్ స్ట్రేంజ్ ను ఆశ్రయించాడు. తానే స్పైడర్ మ్యాన్ అనే విషయాన్ని ప్రజలు మరిచిపోయేలా చేయాలని కోరతాడు. దీంతో జనాలు పీటర్ పార్కరే స్పైడర్ మ్యాన్ అనే విషయాన్ని మరిచిపోయేలా చేస్తాడు డాక్టర్ స్ట్రేంజ్.
అయితే పీటర్ పార్కర్ కోసం పాత శత్రువులు తిరిగి రావడం.. వివిధ విశ్వాల్లోని దుర్మార్గులంతా ఒక్కసారే భూమిపై దాడికి దిగడంతో అసలు సమస్యలు మొదలైనట్లు ట్రైలర్ లో చూపించారు.
డాక్టర్ స్ట్రేంజ్ సహాయంతో స్పైడర్ మ్యాన్ శత్రువులతో ఎలా పోరాడాడు? దుర్మార్గుల నుంచి ఈ ప్రపంచాన్ని ఎలా కాపాడాడు? పీటర్ పార్కర్ ఈ సమస్యలను ఎలా ఎదుర్కొన్నాడు? అనేది తెలియాలంటే వచ్చే నెల 17న ''స్పైడర్ మ్యాన్: నో వే హోమ్'' సినిమా చూడాల్సిందే.
అయితే అదే రోజున పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న 'పుష్ప' పార్ట్-1 ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమా తెలుగుతో పాటుగా హిందీ తమిళ మలయాళ కన్నడ భాషల్లో విడుదల కానుంది.
'స్పైడర్ మ్యాన్' సినిమాలో ఇండియాలో కూడా మంచి క్రేజ్ ఉంది. ఇప్పటి వరకు వచ్చిన 8 సినిమాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. ఇప్పుడు క్రిస్మస్ సీజన్ లో ఇండియన్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తూ 'నో వే హోమ్' అంటూ వస్తున్నారు.
దీంతో 'పుష్ప: ది రైజ్' సినిమాపై స్పైడర్ మ్యాన్ ప్రభావం పడుతుందేమో అని ఫిలిం సర్కిల్స్ లో డిస్కష్ చేసుకుంటున్నారు. దక్షిణాది భాషల వరకు 'పుష్ప' సినిమా ఆధిపత్యం ఎలాగూ ఉంటుంది. కాకపోతే బాలీవుడ్ లో స్పైడర్ మ్యాన్ సిరీస్ కు మంచి ఆదరణ ఉంటుంది. మరి పుష్ప దాన్ని తట్టుకొని ఎలా నిలబడుతుందో చూడాలి.