Begin typing your search above and press return to search.

ప్రభాస్ కోసం ఆస్కార్ అవార్డ్ విన్నర్ వస్తాడా...?

By:  Tupaki Desk   |   15 July 2020 2:37 PM GMT
ప్రభాస్ కోసం ఆస్కార్ అవార్డ్ విన్నర్ వస్తాడా...?
X
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - పూజాహెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'రాధే శ్యామ్'. రెబల్ స్టార్ కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్ మరియు గోపీకృష్ణ మూవీస్‌ బ్యానర్లు కలిసి సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'జిల్‌' ఫేమ్ రాధా కృష్ణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్ కెరీర్లో 20వ చిత్రంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ఇటీవల విడుదల చేశారు. అయితే చిత్ర యూనిట్ "రాధే శ్యామ్" సంగీత దర్శకుడు ఎవరు అనేది మాత్రం వెల్లడించలేదు.

దీంతో ప్రభాస్ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనేది ఆసక్తిగా మారింది. నిజానికి ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ అంటూ చాలామంది పేర్లు తెరపైకి వచ్చాయి. ముందుగా నేషనల్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారని.. ఆ తర్వాత జస్టిన్ ప్రభాకర్ అని న్యూస్ వచ్చింది. ఇక బాలీవుడ్ బ్యాగ్రౌండ్ స్కోర్ స్పెషలిస్ట్ జూలియస్ ప్యాకియం ప్రభాస్20 కోసం వర్క్ చేయబోతున్నాడని అందరూ అనుకున్నారు. అయితే ఈ వార్తలన్నీ పుకార్లే అని అర్థం అయింది. దీంతో 'సాహో'లాగే ఈ సినిమాకు జరిగినట్లే "రాధే శ్యామ్" కి అవుతుందేమో అని ఫ్యాన్స్ ఆలోచనలో పడ్డారు. 'సాహో' సినిమాకి మల్టిపుల్ మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ చేసిన విషయం తెలిసిందే. దీని వల్ల ప్రేక్షకులు మ్యూజిక్ విషయంలో కొంత నిరాశకు గురయ్యారు. ఇప్పుడు 'రాధే శ్యామ్' కి కూడా మల్టిపుల్ మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ చేయబోతున్నారనే వార్తలు ఊపందుకున్నాయి.

కాగా ఇప్పుడు లేటెస్టుగా ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ "రాధే శ్యామ్" సినిమాకి వర్క్ చేయబోతున్నాడని అనే న్యూస్ స్ప్రెడ్ అవుతోంది. పాన్ ఇండియా మూవీ కాబట్టి రెహమాన్ అయితేనే న్యాయం చేయగలడని చిత్ర యూనిట్ భావిస్తోందట. అంతేకాకుండా ఏఆర్ రహమాన్ మ్యూజిక్ అందివ్వబోయేది ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కబోయే సినిమాకి అంటూ మరో వార్త కూడా హల్ చల్ చేస్తోంది. ఈ రెండు వార్తల్లో ఏది నిజమో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. ఇదిలా ఉండగా రెహమాన్ తెలుగులో సంగీతం అందించిన ఒకటి రెండు సినిమాలు తప్ప పెద్దగా హిట్ అయిన సందర్భాలు లేవు. ఒకవేళ ఈ న్యూస్ నిజమై రెహమాన్ మ్యూజిక్ అందిస్తే ప్రభాస్ కి ఎలాంటి రిజల్ట్ దక్కుతుందో చూడాలి. ఏదేమైనా ప్రభాస్ సినిమాకి సంగీత దర్శకుడు ఎవరనే దానిపై మేకర్స్ కలుగజేసుకొని త్వరలోనే ఓ క్లారిటీ ఇవ్వాలని డార్లింగ్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.