Begin typing your search above and press return to search.
ప్రభాస్ 'చక్రం'కు మరో వెర్షన్ లా వుంటుందా?
By: Tupaki Desk | 31 Jan 2023 8:00 AM GMTనాగశౌర్య హీరోగా నటించిన 'ఛలో' సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న వెంకీ కుడుముల అదే ఊపుతో మరో హిట్ ని కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. నితిన్ హీరోగా వెంకీ కుడుముల తెరకెక్కించిన 'భీష్మ' సూపర్ హిట్ అనిపించుకుని వెంకీ కుడుములకు డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమా విజయంతో మెగాస్టార్ చిరు దృష్టిలో పడిన వెంకీ కుడుముల ఊహించని విధంగా చిరుని డైరెక్ట్ చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు.
స్వతహాగా చిరు అభిమాని కావడంతో కోరకుండానే తనని వెతుక్కుంటూ చిరు సినిమా రావడంతో అతని ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. అయితే ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. స్టార్ ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య నిర్మాతగా ఈ మూవీని ప్రారంభిస్తామంటూ అధికారికంగా ప్రకటించారు కూడా. కానీ ఊహించని విధంగా ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లకుండానే ఆగిపోయింది. దీంతో కసితో వున్న వెంకీ కుడుముల ఈ సారి బ్లాక్ బస్టర్ హిట్ తో తనపై వచ్చిన కామెంట్ లకు సమాధానం చెప్పాలనే ఫైర్ తో వున్నాడట.
ఈ నేఫథ్యంలోనే తన తదుపరి మూవీని నితిన్ తో చేయబోతున్నాడు. వీరిద్దరి కలయికలో ఇప్పటికే 'భీష్మ' వంటి సూపర్ హిట్ మూవీ రూపొందిన విషయం తెలిసిందే. నితిన్ కెరీర్ లో భారీ వసూళ్లని రాబట్టింది. దీంతో మళ్లీ ఈ హిట్ కాంబినేషన్ లో సినిమా రానుండటంతో ఈ ప్రాజెక్ట్ పై సర్వత్రా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా వుంటే ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికరమైన వార్త ఒకటి ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.
ఈ మూవీ స్టోరీ ఇదే అంటూ ఓ ఆసక్తికరమైన అప్ డేట్ ఆకట్టుకుంటోంది. వివరాల్లోకి వెళితే.. ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడే ఓ యువకుడి నేపథ్యంలో ఈ మూవీ సాగుతుందని తెలుస్తోంది. మరో నెల రోజుల్లో చనిపోతానని తెలిసిన ఆ యువకుడు ఎలాంటి మానసిక సంఘర్షణకు లోనయ్యాడు?.. ఎలాగూ చనిపోతున్నామని తెలిసిన యువకుడు తన లైఫ్ ని ఎలా డిజైన్ చేసుకున్నాడు? ఈ క్రమంలో అతని గురించి తెలిసిన వాళ్లంతా చూపించే సింపతీపై అతను ఎలా రియాక్ట్ అయ్యాడనే అంశాలని వినోదాత్మకంగా చూపిస్తూ దర్శకుడు వెంకీ కుడుముల ఈ మూవీని నడిపించబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.
'చక్రం' సినిమాని గుర్తు చేస్తున్నా వెంకీ కుడుముల మార్కు ఎంటర్ టైన్ మెంట్ తో పూర్తి స్థాయిలో వినోదాత్మకంగా ఈ మూవీని తెరపైకి తీసుకురానున్నాడని ఇన్ సైడ్ టాక్. ఇందులో వున్న నిజమెంత అన్నది తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఇక ఈ మూవీని టాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపనీ మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో నిర్మించనున్నారని తెలిసింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.