Begin typing your search above and press return to search.
మంచు మనోజ్ - మౌనిక వ్యవహారంపై క్లారిటీ రానుందా..?
By: Tupaki Desk | 15 Sep 2022 4:27 AM GMTటాలీవుడ్ హీరో మంచు మనోజ్ త్వరలో రెండో పెళ్లి చేసుకుంటున్నాడంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దివంగత భూమా నాగిరెడ్డి దంపతుల చిన్న కూతురు మౌనికా రెడ్డితో మనోజ్ వివాహం జరగనున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి.
కొన్ని రోజుల ముందు మనోజ్ మరియు మౌనిక రెడ్డి సీతాఫలమండిలోని ఒక గణేష్ మండపానికి కలసి వచ్చిన సంగతి తెలిసిందే. వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అప్పటి నుంచి వారిద్దరి మధ్య ఉన్న బంధం గురించి.. పెళ్లి గురించి వార్తలు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
ఇదే విషయం మీద మంచు మనోజ్ ను మీడియా మిత్రులు ప్రశ్నించగా.. "అది వ్యక్తిగత విషయం.. మంచి రోజు వచ్చినప్పుడు నేనే మీ అందరికీ తెలియజేస్తాను. సినిమాలు మరియు పొలిటికల్ ఎంట్రీ గురించి కూడా త్వరలోనే చెప్తాను" అని బదులిచ్చారు.
మంచు మనోజ్ తన రెండో పెళ్లి వార్తలను ధృవీకరించ లేదు. అలా అని ఖండించనూ లేదు. కానీ మంచి రోజు వచ్చినప్పుడు అన్నీ తెలియజేస్తానని నవ్వుతూ చెప్పడంతో.. ఈ విషయంపై మరిన్ని వార్తలు ఊపందుకున్నాయి. మనోజ్ - మౌనిక పెళ్లి తేదీ కూడా ఖరారైందనేలా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే భూమా - మంచు కుటుంబాలు మనోజ్ - మౌనిక పెళ్లి గురించి మాట్లాడుకున్నారని.. డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఇదే విషయంపై మాట్లాడేందుకు భూమా ఫ్యామిలీ నుండి మౌనిక సోదరి అఖిల ప్రియ మీడియా సమావేశం నిర్వహించబోతోందని ఓ వార్త మీడియా సర్కిల్స్ లో వైరల్ అయింది.
అయితే తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం మీడియా ముందుకు వచ్చేది అఖిల ప్రియ కాదని.. ఆమె సోదరుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి అని తెలుస్తోంది. ఈరోజు గురువారం సాయంత్రం హైదరాబాద్ లోని తన నివాసంలో జగత్ మీడియా సమావేశం నిర్వహించబోతున్నట్లుగా ప్రధాన మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఇదే నిజమైతే, ఈ సమావేశంలో భూమా జగత్ విఖ్యాత్ ఏం చెప్పబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మంచు మనోజ్ - భూమా మౌనికా రెడ్డిల పెళ్లి గురించి మాట్లాడటానికే ప్రెస్ మీట్ పెడుతున్నారా? లేదా ఆ వార్తలన్నీ ఒట్టి రూమర్స్ అని ఖండించాడు పెడుతున్నారా? అని అందరూ చర్చించుకుంటున్నారు. ఏదేమైనా ఈ మీడియా సమావేశం తర్వాత మనోజ్ - మౌనికల వ్యవహారంపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఇకపోతే మంచు మనోజ్ కి 2015లో ప్రణతి రెడ్డితో వివాహం జరిగిన సంగతి తెలిసిందే. వీరిద్దరిదీ ప్రేమ పెళ్ళి. అయితే కొన్నాళ్లకు ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. అలానే భూమా మౌనిక కూడా తన భర్తతో విడిపోయింది. ఆమెకు ఓ కొడుకు కూడా ఉన్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.