Begin typing your search above and press return to search.
'పొన్నియిన్ సెల్వన్ 2' వుంటుందా?
By: Tupaki Desk | 30 Sep 2022 5:30 PM GMTదిగ్రేట్ డైరెక్టర్ గా ఇండియా వ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు మణిరత్నం. ఆయన 30 ఏళ్ల డ్రీమ్ 'పొన్నియిన్ సెల్వన్'. ఎంజీ ఆర్ నుంచి కమల్ హాసన్, రజనీకాంత్ ఆ తరువాత దళపతి విజయ్, సూపర్ స్టార్ మహేష్ బాబు లతో చేయాలని మణిరత్నం విశ్వప్రయత్నాలు చేశారు. ఫైనాన్షియర్ లు వెనక్కి తగ్గడంతో విజయ్, మహేష్ లతో చేయాలనుకున్న ఈ ప్రాజెక్ట్ వెనక్కి వెళ్లిపోయింది. ఫైనల్ గా లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ ముందుకు రావడంతో ఎట్టకేలకు పట్టాలెక్కింది.
చియాన్ విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యారాయ్, త్రిష కీలక పాత్రల్లో నటించారు. 'బాహుబలి' తరహాలో రెండు భాగాలుగా తెరకెక్కించాలని ప్లాన్ చేశారు. ముందుగా 'పొన్నియిన్ సెల్వన్ 1'ని భారీ స్థాయిలో పూర్తి చేశారు. సెప్టెంబర్ 30న సినిమా రిలీజ్ అని ప్రకటించిన దగ్గరి నుంచి తమిళ ప్రేక్షకులు మా నుంచి కూడా 'బాహుబలి'కి బాప్ వచ్చేస్తోందంటూ హడావిడీ చేయడం మొదలు పెట్టారు. నెట్టింట భారీ స్థాయిలో సందడి చేశారు. అయితే తమిళనాడుతో తప్ప ఈ సినిమాకు మరెక్కడా బజ్ లేకపోవడం గమనార్మం.
తెలుగులో మణిరత్నం సినిమాలకు మంచి క్రేజ్ వుంటుంది. కానీ ఆ బజ్.. క్రేజ్ ఈ సినిమాకు ఏ దశలోనూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కనిపించలేదు. ఎలాంటి బజ్ ని తెలుగులో క్రియేట్ చేయలేకపోయిన ఈ మూవీ ఫైనల్ గా ప్రకటించిన తేదీనే థియేటర్లలోకి వచ్చేసింది. తమిళంలో పాపులర్ రైటర్ కల్కీ కృష్ణమూర్తి రచించిన ఫేమస్ నవల 'పొన్నియన్ సెల్వన్' ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది. ఎన్నో ఏళ్ల క్రితమే పాపులర్ నవలగా ఫేమస్ అయిన దీని ఆధారంగా సినిమా అనగానే అంతా ఆసక్తిని చూపించారు. కానీ ఏ విషయంలోనూ మణిరత్నం సినిమా సగటు ప్రేక్షకుడిని ఎంగేజ్ చేయలేకపోయింది.
ఎంతో మందిని ఎగ్జైట్ చేసిన నవలని మణిరత్నం ఆ స్థాయిలో తెరపైకి తీసుకురావడంతో విఫలమయ్యాడా? అంటే 'పొన్నియన్ సెల్వన్ 1' చూసిన ప్రతీ ఒక్కరూ యునానిమస్ గా చెబుతున్నారు. 'పొన్నియన్ సెల్వన్' నవల మొత్తం ఐదు భాగాలు వుంటే సినిమా కథకు వచ్చేసరికి రెండు పార్ట్ లకు కుదించి రూపొందించారు. అయితే ఈ విషయంలో మణిరత్నం టీమ్ ప్రాపర్ హోమ్ వర్క్ చేసినట్టుగా ఎక్కడా కనిపించడం లేదు. మధ్యలో కథని మొదలు పెట్టి అసంపూర్తిగా వదిలేసినట్టుగా కనిపిస్తోంది.
ఇక రెండు భాగాలుగా సినిమాని తెరకెక్కించడానికి అసలు కథని ఆసక్తికర పాయింట్ నుంచి మొదలు పెట్టాల్సిన మణిరత్నం కథను మధ్యలో నుంచి మొదలు పెట్టడంతో సగటు ప్రేక్షకుడికి ఏ పాత్ర కూడా పెద్దగా కనెక్ట్ అవ్వదు. ఇక కథకు కీలకంగా నిలిచిన ఆదిత్య కరికాలుడు, అరుణ్మోళి మహా యోధులని, నందిని (ఐశ్వర్యారాయ్) మహాజాదూ అని చూపించే ప్రయత్నం ఎక్కడా చేయలేదు.. మాటలతో ముగించారంతే. దీంతో ఈ క్యారెక్టర్స్ ప్రేక్షకుడికి పెద్దగా కనెక్ట్ కావు.
ఇక ఇలాంటి లార్జర్ దెన్ లైఫ్ సినిమాకు ప్రధాన బలం ఎమోషన్స్.. అవి ఈ సినిమాలో ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం. కార్తి పాత్ర తప్పు పార్ట్ 1 లో మరే పాత్రకు ప్రాధాన్యత లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించకమానదు. అన్ కంప్లీట్ గా పార్ట్ 1 ని వదలడంతో పార్ట్ 2 అని అర్థమవుతోంది. అయితే ఫస్ట్ పార్ట్ ఫలితం చూశాక మేకర్స్ పార్ట్ 2 ని చేసే ధైర్యం చేస్తారా? అన్నది ప్రతీ ఒక్కరి మైండ్ ని తొలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.