Begin typing your search above and press return to search.
సీనియర్ స్టార్ హీరోల సరసన ఈ బ్యూటీస్ జోరు పెరగనుందా?
By: Tupaki Desk | 20 Jun 2021 9:30 AM GMTతెలుగులో సీనియర్ స్టార్ హీరోలుగా చిరంజీవి .. బాలకృష్ణ .. నాగార్జున .. వెంకటేశ్ జోరు కొనసాగుతూనే ఉంది. గతంలో వాళ్లతో కలిసి అందాల సందడి చేసిన భామలు, ఇప్పుడు కేరక్టర్ ఆర్టిస్టులుగా ముఖ్యమైన పాత్రలను చేస్తూ వెళుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సీనియర్ స్టార్ హీరోల సరసన నాయికలను సెట్ చేయడం కష్టమవుతోంది. అనుష్క సినిమాల సంఖ్యను తగ్గించుకుంటూ రాగా, శ్రియ గతంలోని క్రేజ్ కి దూరంగా వెళ్లిపోయింది. ఇక నయనతార .. త్రిష ఇద్దరూ కూడా నాయిక ప్రధానమైన పాత్రలను ఎక్కువగా చేస్తూ బిజీగా ఉన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో సీనియర్ స్టార్ హీరోల సరసన నాయిక అనగానే అందరికీ కూడా కాజల్ .. తమన్నా మాత్రమే కనిపిస్తున్నారు. ఆల్రెడీ మూడు సినిమాలతో కాజల్ .. మూడు సినిమాలతో తమన్నా తీరిక లేకుండా ఉన్నారు. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే ఇటీవల చిరూ సరసన నాయికగా కాజల్ ను .. బాలయ్య జోడీగా ప్రగ్యా జైస్వాల్ ను తీసుకున్నారు. మిగతా హీరోయిన్లంతా కుర్రతనం పోనివారే .. ఆ స్థాయి క్రేజ్ కి ఆమడదూరంలో ఉన్నవారే. ఇలాంటి పరిస్థితుల్లోనే రకుల్ .. రెజీనా పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
యువ కథానాయకుల సరసన రకుల్ తనదైన దూకుడు చూపించింది. ఆ తరువాత బాలీవుడ్ పై దృష్టిపెట్టేసి, తెలుగుతో పాటు, తమిళ భాషల్లోను వెనుకబడిపోయింది. 'మన్మథుడు 2'లో ఆమె నాగార్జున సరసన సందడి చేసింది. ఇక తెలుగులో ఆశించినస్థాయిలో అవకాశాలు లభించకపోవడం వలన తమిళ సినిమాలపై రెజీనా దృష్టిపెట్టింది. అక్కడే వరుస సినిమాలను చేసుకుంటూ వెళుతోంది. త్వరలో ఈ ఇద్దరు కథానాయికలు సీనియర్ స్టార్ హీరోల సరసన బిజీ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పుకుంటున్నారు. అది ఎంతవరకూ నిజమవుతుందో చూడాలి మరి.