Begin typing your search above and press return to search.

కరోనా ఎఫెక్ట్.. ఈ హీరోలకు గడ్డుకాలమేనా?

By:  Tupaki Desk   |   8 April 2020 2:30 AM GMT
కరోనా ఎఫెక్ట్.. ఈ హీరోలకు గడ్డుకాలమేనా?
X
ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ విజృంభణతో పలు దేశాల్లో లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. భారతదేశంలో కూడా లాక్ డౌన్ అమలుపరుస్తున్నారు. దీంతో దాదాపుగా ప్రజా జీవనం స్థంబించిపోయింది. వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. కరోనాను అదుపులోకి తీసుకు రావాలంటే కఠిన చర్యలు తప్పవనే సంగతి అందరూ అర్థం చేసుకున్నారు. అయితే ఈ లాక్ డౌన్ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా ఉండబోతోందని ఇప్పటికే సూచనలు అందుతున్నాయి.

ఎన్నో రంగాలలో ఉద్యోగాలకు కోతపడనుంది. ఉద్యోగం ఉన్నవారికి జీతంలో కోతలు పడుతున్నాయి. ప్రతి ఒక్కరంగం ఏదో ఒక విధంగా ఇతర రంగాలపై ఆధారపడి ఉంటుంది. అన్ని రంగాలుదెబ్బతింటే ఆ ప్రభావం సినీరంగంపై పడడం ఖాయమనే అంచనాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే థియేటర్లు మూతపడ్డాయి. థియేటర్లు రీఓపెన్ చేసిన తర్వాత ఆక్యుపెన్సీ ఎలా ఉంటుందనే విషయం ఎవరూ ఊహించలేకపోతున్నారు. పెద్ద స్టార్ హీరోల సంగతి సరే కానీ చిన్న హీరోలకు.. మీడియం రేంజ్ హీరోలకు గడ్డుకాలం తప్పదని ట్రేడ్ వర్గాలలో టాక్ వినిపిస్తోంది.

ముఖ్యంగా వరస ఫ్లాపులలో ఉంటూ క్రౌడ్ ను థియేటర్లకు రప్పించలేనివారి సినిమాలపై ఈ ప్రభావం ఎక్కువ ఉంటుందని అంటున్నారు. నిజానికి ఈ హీరోలలో ఇక ఫ్యూచర్ లో సినిమాలు నిర్మించేందుకు ప్రొడ్యూసర్లు ముందుకు వస్తారా అనేది కూడా అలోచించాల్సిన విషయం అంటున్నారు. ఈ లిస్టులో రవితేజ.. విజయ్ దేవరకొండ.. నాగ శౌర్య.. రాజ్ తరుణ్.. సందీప్ కిషన్.. కళ్యాణ్ రామ్.. కార్తికేయ.వీరే కాకుండా ఇంకా కొందరు హీరోలు ఉన్నారట. వీరిలో ఎక్కువ మంది హీరోలు ఫ్లాపులలో ఉన్నారు. కరోనా ప్రభావం తర్వాత థియేటర్లు తెరిచినా ఈ హీరోల సినిమాలు చూసేందుకు అసలు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తారా అనేది సందేహమే.

క్రేజ్ ఉన్నప్పుడే సంపాదించుకోవాలనే ఉద్దేశంతో విజయ్ దేవరకొండ తన పారితోషికం పెంచాడు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అడిగినంత రెమ్యూనరేషన్ ఇస్తారా అనేది అలోచించాల్సిన విషయం. థియేట్రికల్ రిలీజ్ తో డబ్బులు రాబట్టుకునే అవకాశం లేని పక్షంలో ఆటోమేటిక్ గాసినిమా బడ్జెట్లు తగ్గుతాయి.. రెమ్యూనరేషన్లు కూడా తగ్గుతాయి. ఇంతవరకూ బాగానే ఉంది కానీ సినిమాలు నిర్మించేందుకు ప్రొడ్యూసర్లు ముందుకు రాకపోతేనే కష్టం.