Begin typing your search above and press return to search.
సంక్రాంతి 2020 - సీన్ మారుతుందా
By: Tupaki Desk | 4 Aug 2019 1:30 AM GMTప్రతి ఏడాది సంక్రాంతి టాలీవుడ్ కు అతి పెద్ద పండగ సీజన్ అనే సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఎంత పెద్ద స్టార్లు నటించిన రెండు మూడు సినిమాలైనా ఈజీగా అకామిడేట్ చేసే ఛాన్స్ ఒక్క ఈ ఫెస్టివల్ కు మాత్రమే ఉంటుంది. అందుకే ఆరు నెలల ముందే ఆ స్లాట్స్ ని బుక్ చేసుకునేందుకు నిర్మాతలు పోటీ పడుతూ ఉంటారు. 2020కు సైతం ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
ప్రస్తుతానికి మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరుతో పాటు అల్లు అర్జున్ 19 ఆల్రెడీ రేస్ ని లాక్ చేసుకున్నాయి. రజనీకాంత్ దర్బార్ కూడా ఫిక్స్ అయ్యింది.కానీ కొన్ని పరిణామాలు సీన్ ని మార్చేలా కనిపిస్తున్నాయి. అందులో మొదటిది బన్నీ తన సినిమాను ఇలా గుంపులో కాకుండా సోలో రిలీజ్ చేసుకుంటే వేరే టైంలో అయినా మంచి రికార్డులు సాదిస్తుందని ఆ కోణంలో ఆలోచించమని నిర్మాతలకు చెప్పాడట. ఎలాగూ షూటింగ్ లో జాప్యం జరుగుతోంది కాబట్టి అప్పటికి డెడ్ లైన్ మీట్ అవ్వగలమా అనే అనుమానం లేకపోలేదట
మరో టాక్ ఏంటంటే ఒకవేళ సైరా గ్రాఫిక్స్ కారణంగా అక్టోబర్ 2 రాలేకపోతే దానికీ సంక్రాంతి తప్ప వేరే ఆప్షన్ ఉండదు. నవంబర్ డిసెంబర్ లు ఎంత లేదన్నా కొంత డ్రైగా ఉంటాయి. పెద్ద సినిమాలకు వర్క్ అవుట్ కాదు. అదే కనక జరిగితే అల్లు అర్జున్ మావయ్య కోసం రేస్ నుంచి తప్పకుంటాడు. సైరా క్యూలోకి వస్తుంది. సరిలేరు నీకెవ్వరు ఊహించని టఫ్ కాంపిటీషన్ వస్తుంది.
వీటి లెక్కలు ఎలా ఉన్నా రజని దర్బార్ మాత్రం ఎలాంటి అనుమానం లేకుండా బరిలో దిగడం ఖాయం. అందుకే ఇప్పుడీ ట్రయాంగిల్ వార్ కు చెక్ పడాలి అంటే ఇంకో రెండు నెలలు ఆగాల్సిందే. అప్పటిదాకా సదరు యూనిట్స్ కి సైతం క్లారిటీ రాదు. చిరు పుట్టిన రోజు 22న ఏదైనా అనౌన్స్ మెంట్ జరిగితే ఈ క్లాష్ గురించి స్పష్టత రావొచ్చు. చూద్దాం.