Begin typing your search above and press return to search.
ఆ రీమేక్ ని భవధీయుడికి ముందే ఫినిష్ చేస్తారా?
By: Tupaki Desk | 18 Jun 2022 1:30 AM GMTపవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూడేళ్లు జనసేన పార్టీ కార్యకలాపాల కోసం సినిమాలకు విరామం ప్రకటించారు. ఆ తరువాత బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'పింక్' ఆధారంగా తెరకెక్కిన 'వకీల్ సాబ్' మూవీతో మళ్లీ కెమెరా ముందుకొచ్చారు. కరోనా భయాల మధ్య థియేటర్లో విడుదలైన ఈ మూవీ మంచి టాక్ ని సొంతం చేసుకుని పవన్ ఫ్యాన్స్ లో జోష్ ని నింపింది. పవర్ ఫుల్ లాయర్ గా పవన్ కనిపించిన తీరు, ఆయన పాత్రని మలిచిన విధానం ఫ్యాన్స్ ని మరింత ఖుషీ చేసింది.
దీంతో మరో రీమేక్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అదే 'భీమ్లానాయక్'. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన 'అయ్యప్పనుమ్ కోషియుమ్' ఆధారంగా ఈ మూవీని సాగర్ చంద్ర డైరెక్షన్ లో రీమేక్ చేశారు. ఇటీవలే విడుదలై ఈ చిత్రం మిశ్రమ స్పందనని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఇదే ఊపులో పవన్ మరో రీమేక్ కు శ్రీకారం చుట్టబోతున్న విషయం తెలిసిందే. దర్శకుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సముద్రఖని నటించి తెరకెక్కించిన తమిళ చిత్రం 'వినోదాయ సితం'. ఈ మూవీ అక్కడ మంచి విజయాన్ని సాధించడమే కాకుండా విమర్శకుల ప్రశంసల్ని సైతం సొంతం చేసుకుంది.
ఇదే చిత్రాన్ని తెలుగులో పవన్ కల్యాణ్ రీమేక్ చేయబోతున్నారు. దైవ దూత పాత్రలో పవన్ నటించనున్న ఈ మూవీకి సముద్రఖని దర్శకత్వం వహించనున్నారు. యంగ్ హీరో పాత్ర కూడా వుండటంతో ఆ పాత్రలో సాయి ధరమ్ తేజ్ ని కన్ఫర్మ్ చేశారు కూడా. స్క్రిప్ట్ లో తెలుగు నేటివిటీకి అనుగునంగా మార్పులు చేసిన త్రివిక్రమ్ ఈ మూవీకి మాటలు, స్క్రీన్ ప్లేని అందిస్తున్నారని తెలిసింది. జీ స్టూడియోస్, పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించబోతున్నాయి.
గత కొన్ని రోజులుగా ఈ మూవీ ప్రారంభం పై తర్జన నడుస్తోందని వార్తలు వినిపించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ కోసం పక్కా ప్లాన్ చేశారని, కేవలం 40 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేయాలని ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇందులో పవన్ 20 రోజులు డేట్స్ కేటాయించబోతున్నారంటూ ఇప్పటికే ఓ వార్త బయటికి వచ్చేసింది.
ఈ మూవీ తరువాతే హరీష్‌శంకర్ డైరెక్ట్ చేయబోతున్న 'భవదీయుడు భగత్ సింగ్'ని పట్టాలెక్కిస్తారని ఇన్ సైడ్ టాక్. రాబోయే ఎలక్షన్స్ ప్రచారానికి వెళ్లడానికి ముందే ఈ రెండు ప్రాజెక్ట్ లని రికార్డు స్థాయి టైమ్ లో పూర్తి చేసి ఆ తరువాతే ఎలక్షన్స్ ప్రచారానికి వెళ్లాలని పవన్ ముందే ప్లాన్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది.
ఈ ప్లానింగ్ గనక నిజమే అయితే 'భవదీయుడు భగత్ సింగ్' చిత్రాన్ని నిర్మించనున్న మైత్రీ మూవీమేకర్స్ వారికి, చాలా రోజులుగా ఈ ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తున్న స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ కు బిగ్ రిలీజ్ లభించినట్టే నని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.