Begin typing your search above and press return to search.
బాక్సాఫీస్ కు ఊపు తెచ్చే సినిమా ఒక్కటైనా ఉందా..?
By: Tupaki Desk | 27 Oct 2022 2:38 AM GMTటాలీవుడ్ లో దసరా - దీపావళి సందడి ముగిసింది. ఆడియన్స్ ని అలరించి ఫెస్టివల్ సీజన్ ని క్యాష్ చేసుకోవాలనే లక్ష్యంతో అనేక సినిమాలు బాక్సాఫీస్ బరిలో నిలిచాయి. అందులో కొన్ని సినిమాలు ఊహించని విధంగా వసూళ్ళు రాబడితే.. మరికొన్ని ఆశించిన స్థాయిలో ప్రభావం చూపించలేకపోయాయి.
సాధారణంగా ఎప్పుడూ కూడా ఇండస్ట్రీలో దసరా పండక్కి బాక్సాఫీస్ వద్ద సందడి కనిపిస్తుంది. దీపావళి ని మాత్రం డ్రై సీజన్ గా భావిస్తుంటారు. తెలుగు చిత్రాలకు ఈ ఫెస్టివల్ కలిసి రాదనే నమ్మకం చాలా ఏళ్లుగా కొనసాగుతూ వస్తోంది. అయితే ఈసారి దసరా - దీపావళి రెండు సీజన్లలో పెద్దగా మెరుపులు కనిపించలేదు.
విజయ దశమి సందర్భంగా థియేటర్లలోకి వచ్చిన సినిమాలలో 'గాడ్ ఫాదర్' పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. బ్రేక్ ఈవెన్ కు కాస్త దూరంలోనే నిలిచిపోయింది. 'ది ఘోస్ట్' సినిమా తీవ్ర నిరాశ పరిచింది. మంచి రివ్యూలు రాబట్టిన 'స్వాతిముత్యం' సినిమా కూడా వసూళ్ల వేటలో వెనకబడిపోయింది.
అయితే ఆ తర్వాత వచ్చిన కన్నడ డబ్బింగ్ సినిమా 'కాంతారా' అనూహ్యమైన కలెక్షన్స్ అందుకుని సంచలనం సృష్టించింది. ఇక దీపావళి సినిమాలలో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న 'సర్దార్' మెరుగైన ప్రదర్శన కనబరుస్తోంది. 'ఓరి దేవుడా' కు మంచి టాక్ వచ్చినప్పటికీ.. ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోతోంది.
'ప్రిన్స్' మరియు 'జిన్నా' సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. 'రామ్ సేతు' వంటి హిందీ డబ్బింగ్ చిత్రాన్ని జనాలు పెద్దగా పట్టించుకోవడం లేదు. దసరా - దీపావళి సీజన్లలో పెద్ద చిత్రాలు - కాస్త గుర్తింపు ఉన్న హీరోల సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే ఈ శుక్రవారం నుంచి ఎప్పుడో చిత్రీకరణ పూర్తై థియేటర్లు దొరకని చిన్న చిత్రాలు రాబోతున్నాయి.
ఈ వారం రాజేంద్రప్రసాద్ నటించిన 'అనుకోని ప్రయాణం' అనే సినిమా విడుదల అవుతుంది. దీంతో పాటుగా 'వెల్ కమ్ టూ తీహార్ కాలేజ్' 'నిన్నే చూస్తు' 'రుద్రవీణ' 'ఫోకస్' వంటి చిన్నా చితక సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి.
నవంబరు 4వ తేదీన మాత్రం అల్లు శిరీష్ 'ఊర్వశివో రాక్షశివో' - సంతోష్ శోభన్ 'లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్' సినిమాలు రాబోతున్నాయి. 'బొమ్మ బ్లాక్ బస్టర్' 'బనారస్' 'ఆకాశం' లాంటి మరో మూడు సినిమాలు కూడా అదే రోజున షెడ్యూల్ చేయబడ్డాయి.
సమంత 'యశోద' - అల్లరి నరేష్ 'మారేడుమిల్లి ప్రజానీకం' - దగ్గుబాటి అభిరామ్ 'అహింస' - సుధీర్ బాబు 'హంట్' సినిమాలు కూడా నవంబర్ నెలలోనే రిలీజ్ కానున్నాయి. వీటితో పాటుగా మరికొన్ని చిన్న చిత్రాలు కూడా థియేటర్లలోకి రావాలని చూస్తున్నాయి.
ఇలా అక్టోబర్ నెలాఖరు మొదలుకొని నవంబర్ చివరి వారం వరకూ అనేక సినిమాలు ముహుర్తాలు ఖరారు చేసుకున్నాయి. అందులో చాలా చిత్రాలు నామమాత్రంగా బరిలో దిగుతున్నాయి. అందుకే రాబోయే నెల రోజులు బాక్సాఫీస్ వెలవెలబోయే పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరి వీటిల్లో ఏవేవి ప్రేక్షకుల ఆదరణ పొందుతాయో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.