Begin typing your search above and press return to search.
ఈ మెగా హీరో ఏలూరు సెంటిమెంట్ బ్రేక్ చేస్తాడా..?
By: Tupaki Desk | 23 Dec 2020 5:30 PM GMTటాలీవుడ్ మెగా హీరో సాయిధరమ్ తేజ్.. సినిమాల పరంగా కాస్త స్పీడ్ పెంచినట్లు తెలుస్తుంది. ఇటీవల 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమా కంప్లీట్ చేసి ప్రస్తుతం దేవా కట్టా దర్శకత్వంలో కొత్త సినిమాను రెడీ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ఏలూరు ఏరియాలో శరవేగంగా జరుపుకుంటుందట. అయితే ఇండస్ట్రీలో ఏలూరు అంటే నెగటివ్ ఒపీనియన్ ఉందని టాక్. ఇప్పటి వరకు ఏలూరులో షూటింగ్ జరుపుకున్న సినిమాలన్నీ ప్లాప్ లుగా మిగిలిపోయాయని ఫిల్మ్ నగర్ లో చాలకాలంగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అయితే ఇప్పుడు సాయితేజ్ దేవాకట్టా దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ ఏలూరులోనే జరుగుతుండటంతో.. అంతేగాక ఈ మధ్య ఏలూరులో ఏవో వింత వ్యాధులు ప్రబలడంతో ఇండస్ట్రీ దృష్టి సాయితేజ్ - దేవాకట్టాల సినిమా పై పడింది.
ఇదిలా ఉండగా.. రమ్యకృష్ణ ప్రస్తుతం ఈ సినిమాలో పవర్ ఫుల్ రాజకీయ నాయకురాలిగా కనువిందు చేయనుందట. ఆ పాత్ర అంత పవర్ ఫుల్లా.. అంటే బాహుబలి తర్వాత రమ్యకృష్ణ పోషిస్తున్న పవర్ ఫుల్ రోల్ ఇదేనని చిత్రయూనిట్ చెప్పుకొస్తున్నారట. ఇదివరకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతులమీదుగా ప్రారంభమైన ఈ సినిమాను జె.భగవాన్, పుల్లారావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ సరసన నివేతా పేతురాజ్ నటిస్తుండగా.. మణిశర్మ సంగీతాన్ని సమకూర్చుతున్నారు. ఏలూరులో షూటింగ్ అనేసరికి రమ్యకృష్ణ కూడా రావడానికి జంకిందని వినికిడి. చివరికి ఆమె డేట్స్ తగ్గించి, ఆ పాత్ర కెరీర్లో కీలకం అవుతుందని నచ్చజెప్పి ఒప్పించారట. మరి నిజంగానే ఈ సినిమాలోని రాజకీయ నాయకురాలి పాత్ర రమ్యకృష్ణ కెరీర్ లో కీలకమవుతుందా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నా సినీ వర్గాలలో మాత్రం ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉండబోతుందో అని చర్చిస్తున్నాయి. మరి నిజంగా ఏలూరు నెగటివ్ సెంటిమెంట్ మెగాహీరో సినిమా పై పడనుందా.. తెలియాలంటే విడుదల వరకు ఆగాల్సిందే..!