Begin typing your search above and press return to search.
ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతుందా ?
By: Tupaki Desk | 23 April 2019 2:30 PM GMTజెర్సీ సక్సెస్ ని నిర్మాతల కంటే బయటివాళ్ళే ఎక్కువగా ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఎక్కడ చూసినా దీని గురించి ప్రశంసలే వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఇది ఇంకా ఉధృతంగా ఉంది. కన్నీళ్ళతో గుండె బరువెక్కిపోయిందని తమ అనుభూతులను గట్టిగానే పంచుకుంటున్నారు. సాధరణంగా ఏదైనా జానర్ కు సంబంధించిన సినిమా సక్సెస్ అయినప్పుడు కొన్నేళ్ళ పాటు అదే ట్రెండ్ లో వరసబెట్టి వస్తూనే ఉంటాయి.
అప్పుడెప్పుడో పెళ్లి సందడి బ్లాక్ బస్టర్ అయితే ఓ ఐదారేళ్ళ పాటు పెళ్లి టైటిల్ తో ఎన్ని సినిమాలు వచ్చాయో లెక్క బెట్టడం కష్టం. ఎర్ర సైన్యం సూపర్ హిట్ అయితే మోహన్ బాబు లాంటి అగ్ర హీరోలు మొదలుకుని చిన్న స్టార్ల దాకా అందరు అవి ట్రై చేశారు. ప్రేమ దేశం వచ్చాక అన్ని ట్రయాంగిల్ లవ్ స్టోరీలే. లారెన్స్ ముని తెచ్చిన ట్రెండ్ గురించి చెప్పాల్సిన పని లేదు. కోన వెంకట్ గీతాంజలి సైతం హారర్ కామెడీకి ఊపిరి పోసింది
సో ఇప్పుడు నాని జెర్సీ కూడా క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలకు ఊతం ఇస్తుందా అనేదే ప్రస్తుతం మెదులుతున్న ప్రశ్న. టాలీవుడ్ లో ఈ నేపధ్యంలో వచ్చిన సినిమాలు చాలా తక్కువ. కొన్నేళ్ళ క్రితం సుమంత్ హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ తీసిన గోల్కొండ హై స్కూల్ చక్కని విజయం సొంతం చేసుకుంది.కాని సుమంత్ ఆ సమయానికి ట్రెండ్ ని శాశించే రేంజ్ స్టార్ కాదు.
కాని నాని కేసు వేరు. జెర్సికి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఇదేదో బాగుందని దర్శక నిర్మాతలు ఈ క్రికెట్ ఫార్ములాను ఆశ్రయించినా ఆశ్చర్యం లేదు. కాకపోతే క్రికెట్ బ్యాక్ డ్రాప్ మరీ కాసులు కురిపించే ఫార్ములా కాదు. చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. అందుకే జెర్సీ ఎంత పెద్ద సక్సెస్ అయినా ఇదో ట్రెండ్ గా మారే అవకాశాలు తక్కువే.