Begin typing your search above and press return to search.

మిల్కీ బ్యూటీ కి ఇదన్నా పని అయ్యేనా..!

By:  Tupaki Desk   |   3 Aug 2022 11:30 PM GMT
మిల్కీ బ్యూటీ కి ఇదన్నా పని అయ్యేనా..!
X
సౌత్‌ సినీ ఇండస్ట్రీలో గత దశాబ్ద కాలంగా స్టార్‌ హీరోయిన్ గా కొనసాగుతూ వస్తున్న మిల్కీ బ్యూటీ తమన్నా ఈ మధ్య కాలంలో ఆశించిన స్థాయిలో సక్సెస్ లను దక్కించుకోలేక పోతుంది.

తెలుగు తో పాటు అన్ని భాషల్లో కూడా ఈ అమ్మడు హీరోయిన్ గా.. ఐటెం సాంగ్స్ తో మరియు వెబ్‌ సిరీస్ లతో ప్రయత్నాలు చేస్తోంది. అయినా కూడా పనవ్వడం లేదు.

తమన్నా కెరీర్‌ ఖతం అనుకున్న ప్రతి సారి కూడా ఏదో ఒక ఆఫర్‌ దక్కుతుంది. ఆ ఆఫర్‌ తమన్నా కెరీర్‌ ను నిలబెడుతుందేమో చూద్దా అన్నట్లుగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు అందరి దృష్టి తమన్నా హిందీలో నటించిన బాబ్లీ బౌన్సర్ అనే సినిమాలో ఉంది. ప్రముఖ దర్శకుడు మధుర్‌ బండార్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

షూటింగ్‌ పూర్తి చేసుకుని పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్ జరుపుకుంఉటన్న బాబ్లీ బౌన్సర్‌ సినిమా ను డైరెక్ట్‌ ఓటీటీ లో స్ట్రీమింగ్‌ చేయబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చింది. డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌ లో ఈ సినిమాను స్ట్రీమింగ్‌ చేయబోతున్నారు. సినిమా స్ట్రీమింగ్ తేదీ కూడా వచ్చేసింది. ఇదే ఏడాది సెప్టెంబర్‌ 23వ తారీకున స్ట్రీమింగ్‌ అవ్వబోతున్న బాబ్లీ బౌన్సర్ కోసం డబ్బింగ్ కార్యక్రమాలను ఈ అమ్మడు ముగించింది.

తాజాగా బాబ్లీ బౌన్సర్‌ సినిమా కు డబ్బింగ్‌ చెబుతున్నాను అంటూ తమన్నా ఈ ఫోటోను షేర్‌ చేసింది. సినిమా పై ఈ అమ్మడు చాలా నమ్మకంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి ఈ సినిమా అయినా తమన్నా చాలా కాలంగా ఎదురు చూస్తున్న సక్సెస్ ను తెచ్చి పెట్టేనా అనేది చూడాలి. తమన్నా ప్రస్తుతం ఒకటి రెండు చిన్న తెలుగు సినిమాల్లో నటించడంతో పాటు ఇతర భాషల్లో కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉంది.

బాబ్లీ బౌన్సర్‌ సినిమా కనుక హిట్‌ అయితే ఖచ్చితంగా తమన్నా కు బాలీవుడ్‌ లో కనీసం రెండు మూడు ఆఫర్లు అయినా వస్తాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బాబ్లీ బౌన్సర్‌ ను డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌ వారు తెలుగు మరియు తమిళంలో కూడా స్ట్రీమింగ్‌ చేయాలని తమన్నా అభిమానులు కోరుకుంటున్నారు.