Begin typing your search above and press return to search.
ఆ రెండు బాలీవుడ్ భవితవ్యాన్ని తేల్చనున్నాయా?
By: Tupaki Desk | 18 Nov 2022 10:30 AM GMTబాలీవుడ్ ఇండస్ట్రీ గత కొతం కాలంగా గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. క్రేజీ స్టార్స్ నటించిన సినిమాలేవీ గత కొంత కాలంగా బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకోవడం లేదు. గతమెంతొ ఘనకీర్తి అన్నట్టుగా గతంలో బాలీవుడ్ సినిమా దేశ వ్యాప్తంగా సంచనాలు సృష్టించేది. అమీర్ ఖాన్ లాంటి హీరో సినిమా వస్తోందంటే చాలు దేశ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద వుండే సందడి.. కాసుల వర్షం మామూలుగా వుండేది కాదు. ఇదే తరహాలో బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ నటించిన సినిమాలు కూడా భారీ హంగామా చేసేవి.
కానీ ఇప్పడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. కరోనా తరువాతే నుంచే బాలీవుడ్ లో విపత్కర పరిస్థితులు మొదలయ్యాయి. అమీర్ ఖాన్ నటించిన 'లాల్ సింగ్ చడ్డా'తో మళ్లీ బాలీవుడ్ కు మంచి రోజులొస్తాయని అంతా భావించారు. కానీ అది జరగలేదు. బాయ్ కాట్ వివాదం కారణంగా అమీర్ ఖాన్ మూవీ 'లాల్ సింగ్ చడ్డా' డిజాస్టర్ అనిపించుకుని షాకిచ్చింది. ఇక ఆ తరువాత అయాన్ ముఖర్జీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 'బ్రహ్మాస్త్ర'పై ఆశలు పెట్టుకున్నారు.
పాజిటివ్ టాక్ నే సొంతం చేసుకున్నా కానీ సినిమా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో బాలీవుడ్ కు మరో సారి నిరాశే ఎదురైంది. ప్రస్తుతం అందరి చూపు రెండు సినిమాపై వుంది. ఈవైనా బాలీవుడ్ భవితవ్యాన్ని మరుస్తాయని ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రేక్షకుల్లో మారిన ట్రెండ్ కు అనుగుణంగా బాలీవుడ్ మేకర్స్ లో మార్పులు చోటు చేసుకోకపోవడం వల్లే బాలీవుడ్ సినిమాలు సౌత్ సినిమాల తరహాలో ఆకట్టుకోలేకపోతున్నాయని విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో సౌత్ రీమేక్ ఆధారంగా తెరకెక్కిన 'దృశ్యం 2', థ్రిల్లర్ కథతో రూపొందిన 'భేడియా' చిత్రాలపై బాలీవుడ్ భారీ ఆశలు పెట్టుకుంది.
మలయాళ, తెలుగు భాషల్లో ఇప్పటికే సూపర్ హిట్ అనిపించుకున్న 'దృశ్యం 2'ని అజయ్ దేవ్‌గన్ హిందీలో రీమేక్ చేశాడు. శ్రియా, టబు, అక్షయ్ ఖన్నా కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీపై భారీ అంచనాలే వున్నాయి. దక్షిణాది భాషల్లో హిట్ అనిపించుకున్న మూవీకి రీమేక్ గా వస్తున్న సినిమా కాబట్టి ఈ మూవీపై మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ శుక్రవారం ఈ మూవీని భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు.
ఇక వరుణ్ ధావన్, క్రితి సనన్ జంటగా నటించిన 'భేడియా' మూవీ నవంబర్ 25న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. 'దృశ్యం 2' సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందితే 'భేడియా' హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఈ రెండు సినిమాలైనా బాలీవుడ్ ని గట్టెక్కించి మళ్లీ ట్రాక్ లోకి తీసుకొస్తాయని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ రెండు సినిమాల ఫలితాలపైనే తరువాత రిలీజ్ కి రెడీ అవుతున్న సినిమాల భవిషత్తు ఆధారపడి వుంది. ఈ రెండు సినిమాల తరువాత రణ్ వీర్ సింగ్ నటిస్తున్న 'సర్కస్' తో పాటు మరిన్ని సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో దృశ్యం 2, భేడియా బాలీవుడ్ కు ఎలాంటి నమ్మకాన్ని కలిగించనున్నాయో వేచి చూడాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.