Begin typing your search above and press return to search.
టాలీవుడ్: ‘కొత్త’గా ఆలోచిస్తోంది..
By: Tupaki Desk | 12 Aug 2019 5:04 AM GMTఎప్పుడు ఆరు పాటలు.. మూడు ఫైట్లేనా.? కొత్తగా ఆలోచించాలి. ఎప్పుడూ చూడని కథని వెండితెరపై ఆవిష్కరించాలి. అది హర్రర్ జోనర్ అయినా పౌరాణిక కథ అయినా.. లేదా యాక్షన్ ఓరియెంటెడ్ అయినా విభిన్నంగా వెళుతూ టాలీవుడ్ లో హిట్ ల పంట పండిస్తున్నారు దర్శకులు..
ఇప్పుడు టాలీవుడ్ లో మూసధోరణికి చెక్ చెబుతూ విభిన్నంగా వెళ్లే వారినే విజయం వరిస్తోంది. అది హిట్ల రూపంలో నిరూపితమవుతోంది కూడా. అర్జున్ రెడ్డి.. బాహుబలి నుంచి మొన్నటి రాక్షసుడు మూవీ వరకు విభిన్న కథలను ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు. కొత్తదనం ఉంటే నెత్తిన పెట్టుకుంటున్నారు. మూస సినిమాలను పక్కనపడేస్తున్నారు.
90వ దశకంలో మాస్ మసాలా సినిమాలు టాలీవుడ్ లో వచ్చాయి. అందులో ఖచ్చితంగా కథకు సంబంధం ఉన్నా లేకున్నా ఆరు పాటలు పెట్టేవారు.. హీరోయిజం చూపించడానికి ఫైట్ సీన్లను తగిలించేవారు. హీరో కొడితే గాల్లో లేచే విలన్లకు థియేటర్లో ప్రేక్షకులు ఈలలు- గోలలు- చప్పట్లతో హుషారెత్తించేవారు.. కానీ ఇప్పుడు సబ్జెక్ట్ లో మ్యాటర్ ఉంటేనే అగ్రహీరోనైనా.. యువ హీరోనైనా ఆదరిస్తున్నారు. అదీ నేచురాలిటీకి దగ్గరగా ఉంటేనే యాక్సెప్ట్ చేస్తున్నారు. 60 ఏళ్ల హీరో 20 ఏళ్ల హీరోయిన్లతో రోమాన్స్ చేయడాన్ని అంగీకరించడం లేదు. కథా బలం లేని పెద్ద హీరో సినిమానైనా బాగోలేదని ముఖం మీదే చెప్పేస్తున్నారు. కొత్తదనం వేటలో పడుతూ విభిన్న జోనర్ కథలను ఎంచుకుంటున్న మన యువ హీరోలు మాత్రం సక్సెస్ అవుతున్నారనే చెప్పాలి.
రాజమౌళి బాహుబలిలాంటి భిన్నమైన పౌరాణికం దేశంలో ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఇక అర్జున్ రెడ్డి లాంటి రోమాంటిక్ లవ్ స్టోరీ అంతే సక్సెస్ అయ్యింది. ఇక రాక్షసుడు లాంటి హర్రర్ కొత్త కాన్సెప్ట్ ప్రేక్షకులను అలరించింది. టాలీవుడ్ ఇప్పుడు కొత్త కథల వెంట పరుగులు తీస్తోంది. కొత్త దర్శకులకు స్వేచ్ఛనిస్తోంది. ఆ స్వేచ్ఛతోనే హిట్స్ పడుతున్నాయి. కొత్త దర్శకుల కథల్లో ఇమేజ్ కోసం పుల్లలు పెట్టిన హీరోలకు మాత్రం ఫ్లాప్ లు వచ్చిపడుతున్నాయి. స్వేచ్ఛనిచ్చిన దర్శకులు అద్భుతాలు తెరపై ఆవిష్కరిస్తున్నారు. ఇక పాత చింతకాయపచ్చడి కథలతో సినిమాలు తీస్తున్న హీరోలకే అదే ఫ్లాపులు పలకరిస్తున్నాయి.