Begin typing your search above and press return to search.

విజయ్ దేవరకొండ టార్గెట్ రీచ్ అవ్వగలడా

By:  Tupaki Desk   |   20 March 2019 6:10 AM GMT
విజయ్ దేవరకొండ టార్గెట్ రీచ్ అవ్వగలడా
X
అర్జున్ రెడ్డితో ఓవర్ నైట్ సెన్సేషన్ గా మారి గీత గోవిందంతో ఇండస్ట్రీ హిట్ తన ఖాతాలో వేసుకున్న విజయ్ దేవరకొండ రాబోయే మూవీ డియర్ కామ్రేడ్ మీద అంచనాలు భారీగానే ఉన్నాయి. మల్టీ లాంగ్వేజ్ లో రిలీజ్ చేయడం మార్కెట్ పరంగా ప్లస్ అయ్యేలా ఉంది. అయితే ఇలా ఒకేసారి నాలుగైదు బాషలలో విడుదల చేయడం సాధారణంగా మన టాలీవుడ్ స్టార్ హీరోలు పెద్దగా చేయలేదు. మహేష్ బాబు అంతటి వాడే ఒక్క స్పైడర్ తప్ప ఇంకేది సమాంతరంగా రిలీజ్ చేసే సాహసం చేయలేకపోయాడు.

కాని విజయ్ దేవరకొండ మాత్రం తమిళ్ మార్కెట్ మీద గట్టి కన్నె వేశాడు. నోటా ఫలితం తీవ్రంగా నిరాశ పరిచినప్పటికీ సాలిడ్ హిట్ ఒకటి పడితే కేరళలో అల్లు అర్జున్ కు వచ్చినట్టు తనకు పక్క రాష్ట్రంలో ఒక ఇమేజ్ ఏర్పడవచ్చు అనే అంచనా కావొచ్చు కాని కోలీవుడ్ లో ఇప్పటిదాకా బలమైన జెండా నాటిన తెలుగు స్టార్ ఎవరూ లేరు. వాళ్ళకు ప్రాంతీయాభిమానం ఎక్కువ. తమిళనాడులో పక్క రాష్ట్రాల హీరోలను నెత్తిన బెట్టుకున్న ఉదంతాలు ఎప్పుడూ లేవు. కేరళలో సైతం అనూహ్యంగా ఒక్క బన్నీకి మాత్రమే ఆ అదృష్టం దక్కింది.

మరి విజయ్ దేవరకొండ అన్ని సినిమాలను ఇలా మల్టీ లాంగ్వేజ్ లోకి తీసుకెళ్ళడం వరస సక్సెస్ లు దక్కినప్పుడే కమర్షియల్ గా వర్క్ అవుట్ అవుతుంది. లేకపోతే డబ్బింగ్ వెర్షన్లకు అదనంగా ఖర్చు పెట్టుకోవడం మినహా నిర్మాతకు పెద్దగా ఒరిగేది ఏమి ఉండదు. ఇదంతా తేలడానికి కొంత టైం అయితే పట్టొచ్చు. డియర్ కామ్రేడ్ ఫలితం విజయ్ దేవరకొండ మల్టీ లాంగ్వేజ్ స్ట్రాటజీకి ఒక దిక్సూచిలా మారనుంది. సక్సెస్ అయ్యిందా ఇక అన్ని అదే వరసలో వెళ్తాయి. లేదంటే ఇకపై వచ్చే వాటి మీద పునరాలోచన జరగొచ్చు. కాని విజయ్ అంత ఈజీగా వదిలేలా లేదు. తమిళ్ దర్శకుడితో హీరో సినిమాను లైన్ లో పెట్టడాన్నే ఉదాహరణగా చెప్పొచ్చు