Begin typing your search above and press return to search.

హేమ బాటలో చెలరేగిపోతున్న వితిక..

By:  Tupaki Desk   |   3 Aug 2019 10:51 AM IST
హేమ బాటలో చెలరేగిపోతున్న వితిక..
X
బిగ్ బాస్ కాన్సెప్ట్ లో ఎప్పుడూ లేని రీతిలో రియల్ భార్యభర్తల్ని హౌస్ కు పంపించే ప్రయోగాన్ని తొలిసారి తెలుగులోనే చేపట్టారు. తాజాగా నడుస్తున్న సీజన్ 3లో సినీ నటులు కమ్ రియల్ లైఫ్ లో భార్యభర్తలైన వరుణ్ సందేశ్.. వితికలను హౌస్ కు ఎంపిక చేయటం తెలిసిందే. వీరిద్దరి జోడి ఆసక్తికరంగా ఉండటమే కాదు.. వీరిద్దరూ హౌస్ లో అప్పుడప్పడు సాగించే రొమాన్స్ హాట్ టాపిక్ గా మారింది.

హౌస్ లో అంతమంది ఉండగా.. వీరిద్దరూ తమదే లోకమన్నట్లుగా వ్యవహరించిన సందర్భాలు లేకపోలేదు. హౌస్ లోకి జంటగా ఎంపికైనప్పటికీ.. సింగిల్ గా ఎవరి గేమ్ వాళ్లు ఆడాల్సి ఉంది. అయినప్పటికీ ఇద్దరూ ఒక అండర్ స్టాండింగ్ తో ఆట ఆడుతున్న భావన ఉంది. ఇదిలా ఉంటే.. సీజన్ 3లో తొలి కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు వరుణ్ సందేశ్. భర్త కెప్టెన్ కావటంతో.. భార్య సైతం ఆ పవర్ ను ప్రదర్శించటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

వరుణ్ కెప్టెన్ అయినప్పటికీ ఆయన భార్య వితిక హౌస్ మేట్స్ కు ఆర్డర్లు వేయటం చూసినప్పుడు.. తొలివారంలో నటి హేమ గుర్తుకు వచ్చేలా వితిక వ్యవహారం మారింది. అందరిపై కమాండ్ చేసేలా వితిక తీరు ఉందన్న మాట వినిపిస్తోంది. తన భర్త కెప్టెన్ అయిన వెంటనే.. వితిక ఆర్డర్లు వేయటం షురూ చేసింది. ఎవరి గిన్నెలు వారే క్లీన్ చేసుకోవాలంటూ ఆర్డర్ వేసేసింది. అంతేకాదు.. కెప్టెన్ ఎలా ఉండాలన్న విషయాన్ని వరుణ్ కు సలహాలు ఇవ్వటం కనిపిస్తోంది. మొత్తానికి తన తీరుతో హేమను గుర్తుకు తెచ్చేలా వ్యవహరిస్తోంది వితిక. మరీ.. తీరును హౌస్ మేట్స్.. ప్రేక్షకులు ఎంతమేర అంగీకరిస్తారో చూడాలి.