Begin typing your search above and press return to search.
పాన్ ఇండియా రేస్ లో వారియర్ లా దూసుకొస్తాడా?
By: Tupaki Desk | 14 Jan 2021 10:30 AM GMTఆత్మవిశ్వాసంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తర్వాతే ఎవరైనా. తొలి నుంచి అతడిది అదే పంథా. గంగోత్రి తర్వాత పూరీతో దేశముదురు.. సుక్కూ తో ఆర్య చేసి బంపర్ హిట్లు కొట్టాడు. ఆ రెండు సినిమాలతో బన్ని ఆత్మవిశ్వాసం స్కైని టచ్ చేసిందనే చెప్పాలి. స్టార్ హీరోగా తన స్థానం పదిలం అన్న నమ్మకం పెంచాయి ఆ రెండు చిత్రాలు. తర్వాత సుకుమార్ తో ఆర్య2లోనూ అద్భుత నట ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత త్రివిక్రమ్ హ్యాట్రిక్ విజయాలతో అతడి స్థాయిని చాలా ఎత్తుకు తీసుకెళ్లాడు.
అయినా ఇండస్ట్రీలో ఇది సరిపోతుందా? పోటీ తీవ్రంగా ఉందిప్పుడు. మనకు ఉన్న అరడజను అగ్ర హీరోలు పాన్ ఇండియా రేస్ లో దూసుకుపోతున్నారు. బాహుబలితో ప్రభాస్ నెలకొల్పిన రికార్డుల్ని వేటాడాలన్న కసి పంతం పెంచుకుని ఎవరికి వారు తెలివైన ప్రణాళికలతో దూసుకుపోతున్నారు. ఇక ప్రభాస్ బాటలోనే తాను కూడా పాన్ ఇండియా స్టార్ గా ఎలివేట్ అవ్వాలన్న పంతం బన్నీలో అంతకంతకు పెరుగుతోంది. ఆ క్రమంలోనే అతడి ఎంపికలు కూడా మారిపోయాయి.
ప్రస్తుతం పుష్ప చిత్రం పాన్ ఇండియా కేటగిరీలోనే రిలీజ్ కానుంది. ఈ మూవీని తెలుగు-తమిళంతో పాటు హిందీలోనూ భారీగా రిలీజ్ చేయాలన్న ప్లాన్ ఉంది. ఇన్ సైడ్ సోర్స్ ప్రకారం.. పుష్ప బన్ని కెరీర్ బెస్ట్ మాస్ హిట్ గా నిలుస్తుందన్న అంచనా ఉందట. సుక్కూ రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మళ్లీ కసిగా అంతకుమించిన గ్రేట్ స్క్రిప్టును రెడీ చేసి బన్నీతో సెట్స్ కెళ్లాడు. దీంతో మరోసారి అల వైకుంఠపురములో రికార్డుల్ని మించిన రికార్డును బన్ని సెట్ చేసే ఆస్కారం ఉందన్న గుసగుసా వినిపిస్తోంది. ఇప్పటివరకూ తెరకెక్కించిన సీన్స్ ఆద్యంతం రక్తి కట్టిస్తాయని ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ సుక్కూ మార్క్ తో ఆద్యంతం రక్తి కట్టిస్తాయని చెబుతున్నారు.
ఆసక్తికరంగా మహేష్ తో సినిమా క్యాన్సిల్ అయ్యాక బన్నీతో సినిమా చేస్తున్న సుక్కూ ఎట్టి పరిస్థితిలో దీనిని ఒక ఛాలెంజ్ గా స్వీకరించడంతో ఎందులోనూ రాజీకి రాకుండా పుష్పని తెరకెక్కిస్తున్నాడని సమాచారం. కారణం ఏదైనా బన్ని మరోసారి ఇండస్ట్రీ నాన్ బాహుబలి రికార్డుల్ని బ్రేక్ చేస్తాడన్న టాక్ ఇన్ సైడ్ వినిపిస్తోంది.
తదుపరి కొరటాల-రాజమౌళి వంటి టాప్ దర్శకులతో బన్ని భారీ ప్రణాళికల్లో ఉన్నారు. అయితే నిన్నటిరోజున.. అల రికార్డులు సాంపిల్ మాత్రమే.. ముందుంది ముసళ్ల పండగ అన్నట్టే మాట్లాడాడు బన్ని. అల వైకుంఠపురములో ఏడాది రీయూనియన్ మీటింగులో అతడి మాటల్ని బట్టి భారీ ప్రణాళికలతో సత్తా చాటాలన్న కసి బయటపడింది. ఇక పాన్ ఇండియా స్టార్ గా తనని తాను విస్తరించుకునే ప్లాన్ లో కసిగా ఉన్నాడని అర్థమవుతోంది.