Begin typing your search above and press return to search.

సమంత సినిమాకు అది కలిసి వస్తుందా?

By:  Tupaki Desk   |   2 Nov 2022 11:30 AM GMT
సమంత సినిమాకు అది కలిసి వస్తుందా?
X
టాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ సమంత నటించిన యశోద సినిమా తెలుగు తో పాటు ఇతర భాషల్లో నవంబర్ 11న విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే ఒక సారి విడుదల వాయిదా పడి తాజాగా విడుదల కాబోతున్న యశోద సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో సమంత పాల్గొనే పరిస్థితి లేదు. ఆమె తీవ్ర అనారోగ్య పరిస్థితిలో ఉన్న విషయం తెల్సిందే.

ఆమె బెడ్‌ పై.. చేతికి సెలైన్ ఉండగా యశోద సినిమాకు డబ్బింగ్‌ చెప్పిన విషయం తెల్సిందే. అలాంటి సమంత సినిమా ప్రమోషన్‌ కు వచ్చే పరిస్థితి లేదు అంటూ చాలా మంది భావిస్తున్నారు. ఇప్పుడు అంతా కూడా సమంత గురించి మాట్లాడుకుంటున్నారు. కనుక యశోద సినిమాకు కావాల్సినంత పబ్లిసిటీ అయితే దక్కింది.

యశోద సినిమా కు సమంత పబ్లిసిటీ చేయకున్నా కూడా తప్పకుండా సానుభూతి కలిసి వస్తుందని.. తప్పకుండా సినిమా కు జనాల నుండి స్పందన ఉంటుందనే నమ్మకంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. సినిమా కాస్త పాజిటివ్ టాక్ దక్కించుకున్నా కూడా ఖచ్చితంగా భారీ కలెక్షన్స్ దక్కించుకునేలా సానుభూతి ఉంది అనడంలో సందేహం లేదు.

సమంత కీలక పాత్రలో నటించిన ఈ సినిమా కథ మొత్తం కూడా సరోగసి విధానం.. ఆ పేరుతో చట్ట విరుద్దంగా సాగుతున్న అక్రమాల గురించి చూపించబోతున్నారట. వరలక్ష్మి శరత్‌ కుమార్‌ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతుంది.

యశోద సినిమాలో సమంత గర్భవతి పాత్రలో కనిపించబోతుంది. గర్భవతిగానే సమంత చేసే యాక్షన్‌ సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయని అంటున్నారు. చాలా రియలిస్టిక్ గా సమంత యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని తాజాగా తెగ ప్రచారం జరుగుతుంది. హాలీవుడ్‌ యాక్షన్ కొరియోగ్రఫర్‌ ఈ సినిమా కి స్టంట్స్ అందించాడు.

మొత్తానికి సమంత మయో సైటిస్ తో బాధపడుతున్న ఈ సమయంలో విడుదల కాబోతున్న నేపథ్యంలో ఫలితం ఎలా ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సమంతకు ఈ సినిమా సక్సెస్ అయితే మానసికంగా బలం చేకూరుతుందని చాలా మంది భావిస్తున్నారు. మరి యశోద ఫలితం ఏంటో తెలియాలంటే నవంబర్‌ 11 వరకు వెయిట్‌ చేయాల్సిందే.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.