Begin typing your search above and press return to search.

ఆయుధాలు అక్కడివే.. ఆనవాళ్ళు ఇక్కడివి

By:  Tupaki Desk   |   19 Jun 2016 5:30 PM GMT
ఆయుధాలు అక్కడివే.. ఆనవాళ్ళు ఇక్కడివి
X
మనలో చాలామంది యాక్షన్ ప్రియులే. అందుకే హాలీవుడ్ సినిమాలకు సైతం ఇక్కడ ప్రాధాన్యత ఎక్కువ. అయితే యుద్ధ నేపధ్యం - సూపర్ హీరోల కోణంలో జరిగే యాక్షన్ లకు కాస్త ఎక్కువ ప్రాధాన్యత వుంటుంది. గ్లాడియేటర్ - ఐరన్ మ్యాన్ - ౩౦౦ - బ్యాట్ మ్యాన్ - హ్యారీ పోటర్ - జేమ్స్ బాండ్ లాంటి సినిమాలకు వాడిన ఆయుధాలు మన మదిలో నిలిచిపోతాయి. అయితే ఆ ఆయుధాలను విదేశాలకు మన భారతదేశం నుండే ఎగుమతి చేసుకుంటున్నారన్నది మనల్ని ఆశ్చర్యపరిచే అంశం.

దేహ్రాడూన్ 'విండ్లాస్' - 'లార్డ్ ఆఫ్ ది బ్యాటిల్స్' అనే రెండు ఆయుధ తయారీ సంస్థలు ప్రత్యేకంగా హాలీవుడ్ సినిమాలకు కావలసిన ఆయుధాలను తయారుచేసి అక్కడికి ఎగుమతి చేస్తారట. విండ్లాస్ సంస్థ స్వాతంత్రానికి ముందునుండీ ఏర్పడిందని ముందుగా బ్రిటిష్ వారికి పిడిబాకుల సప్లై చెయ్యడంతో ప్రారంభమైన సంస్థ ఆ తరువాత అమెరికాలో పెద్ద హోటళ్ళకు రాజుల దుస్తులు - యుద్ధ సామాగ్రీ నమూనాల వరకూ వెళ్ళి చివరికి హాలీవుడ్ సినిమాలకు పనిచేసే స్థితికి వచ్చిందని చెప్పుకొచ్చారు ఆ సంస్థ ప్రస్తుత మేనేజర్ లు సుధీర్ - ప్రదీప్ లు.

ఇక మరో సంస్థ లార్డ్ ఆఫ్ బ్యాటిల్స్ ని మాజీ ఆర్మీ కెప్టైన్ సౌరవ్ స్థాపించారు. ఆర్మీనుండి రిటైర్ అయ్యి- ఆయుధాలపై మక్కువ తో ఈ సంస్థ నెలకోల్పినట్టు సమాచారం. హాలీవుడ్ సినిమాల వివరాలు, వాటి సామాగ్రీ చాలా గోప్యంగా వుంచాలని లేకపోతే లక్షల కాంట్రాక్ట్ చేజారిన సందర్భాలు కూడా వున్నాయని తముగించాడు.. అదన్నమాట వాడే ఆయుధాల సినిమాలు అక్కడివే అయినా.. వాటి మూలమైన ఆనవాళ్ళు ఇక్కడివే.