Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: వింక్ గాళ్ మాయాజాలం వ్వావ్వా

By:  Tupaki Desk   |   5 Nov 2020 8:50 AM GMT
ఫోటో స్టోరి: వింక్ గాళ్ మాయాజాలం వ్వావ్వా
X
ఒకే ఒక్క వింక్ తో ప్ర‌పంచాన్ని త‌న గుప్పిట్లోకి లాక్కుంది ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్. వింక్ సెన్సేష‌న్ గా కుర్రకారు గుండెల్లో ఎప్ప‌టికీ నిలిచిపోయింది. ఆ త‌ర్వాత శ్రీ‌దేవి బంగ్లా అనే వివాదాస్ప‌ద చిత్రంలో న‌టించి ట్రైల‌ర్ తోనే అటు హిందీ ఆడియెన్ కి క‌నెక్ట‌యిపోయింది.

అయితే ఊహించ‌ని విధంగా ఈ అమ్మ‌డి కెరీర్ మాత్రం ఆశించినంత‌గా టేకాఫ్ కాలేదు. కొన్ని వివాదాలు అమ్మ‌డిని పెద్ద‌గానే క‌ల‌వ‌ర పెట్టేశాయి. ప్ర‌స్తుతం క్రైసిస్ వ‌ల్ల కావాల్సినంత తీరిక స‌మ‌యం చిక్కింది. ఈ టైమ్ ని తెలివిగా స‌ద్వినియోగం చేసుకుంటోంది. సోష‌ల్ మీడియా ప్ర‌మోష‌న్స్ లో త‌న‌దైన లుక్ తో మెరిసిపోయేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. ఫ్యాష‌న్ అండ్ ట్రెండ్స్ ప‌రంగా త‌న లెవ‌ల్ ని అమాంతం పెంచేస్తోంది.

ఇంత‌కుముందుతో పోలిస్తే రెగ్యుల‌ర్ ఇన్ స్టా పోస్టింగుల్లో హాట్ కంటెంట్ ని పెంచేసింది. లేటెస్టుగా వింక్ గాళ్ ధ‌రించిన ట్రెండీ క్లీవేజ్ డ్రెస్ అంత‌ర్జాలంలో మంట‌లు పెడుతోంది. అయితే ఈ డిజైన‌ర్ లుక్ ఇప్పుడే చూస్తున్న‌దేం కాదు. అపుడెపుడో కేన్స్ లో ఐష్ తొడిగింది ఇదే.. కాపీ కొట్టేసిందిగా! అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఐశ్వ‌ర్యారాయ్.. సోన‌మ్ క‌పూర్.. జాన్వీ క‌పూర్ వీళ్లంతా విసిరేసిన పాత‌ మోడ‌లే ఇది అన్న‌ది అబ్బాయిల కామెంట్.

అలా థై స్లిట్ లుక్ కూడా ఇప్పుడే కొత్తేమీ కాదు. కానీ మునుప‌టితో పోలిస్తే ప్రియా ప్ర‌కాష్ సంథింగ్ స్పెష‌ల్ గా క‌నిపిస్తోంది ఈ డ్రెస్ లో. అదిరిపోయే ఆ భంగిమ‌కు ఫిదా అయిపోయి సాహో అనేస్తున్నారు కుర్ర‌కారు.