Begin typing your search above and press return to search.
MAA: ప్రకాష్ రాజ్ ప్యానల్ మూకుమ్మడి రాజీనామా..!
By: Tupaki Desk | 12 Oct 2021 12:14 PM GMT'మా' (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల్లో ఓటమి చవిచూసిన ప్రకాశ్ రాజ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ‘సినిమా బిడ్డలం’ ప్యానెల్ నుంచి గెలుపొందిన అభ్యర్థులు అందరూ మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'మా' ఎన్నికల్లో చాలా రౌడీయిజం చేశారని.. నరేష్ ప్రవర్తన సరిలేదని.. క్రమశిక్షణ లేకుండా బెనర్జీ లాంటి సీనియర్ నటుడిపై చేయి చేసుకున్నారని ప్రకాశ్ రాజ్ ఆరోపించారు.
ఎన్నికల్లో మొదటి రోజు గెలిచినవారు రెండో రోజు ఎలా ఓడిపోయారని.. రాత్రికి రాత్రే ఫలితాలు మారాయని.. క్రాస్ ఓటింగ్ జరిగిందని.. పోస్టల్ బ్యాలెట్స్ లో అన్యాయం జరిగిందని ప్రకాష్ రాజ్ అన్నారు. మోహన్ బాబు ఎన్నికల ప్రక్రియలోనే కూర్చున్నారని.. ఎక్కడెక్కడి నుంచో మనుషులను తెచ్చారని తెలిపారు. గత రెండు రోజుల నుంచి జరుగుతున్న ఘటనలపై తన ప్యానెల్ సభ్యులతో చర్చించామని.. ఇలాంటి వాతావరణంలో పని చేయగలమా అని గెలిచిన సభ్యులు అన్నారని.. అందుకే 'మా' సంక్షేమం కోసం అందరం కలిసికట్టుగా ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.
మంచు విష్ణు ఇచ్చిన హామీలకు ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని.. సగం సగం కార్యవర్గం వలన ఉపయోగం లేదని ప్రకాశ్ రాజ్ అన్నారు. తమ ప్యానెల్ లోని సభ్యులంతా బయటకు వచ్చి ‘మా’ సభ్యుల తరపున నిలబడతామని చెప్పారు. తన రాజీనామా గురించి మాట్లాడుతూ.. 'మా' ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశా. మంచు విష్ణు స్వీకరించనని అన్నారు. నేను నా రాజీనామాను వెనక్కి తీసుకుంటా. కానీ, ఒక కండిషన్. అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ‘తెలుగువాడు కాని వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేయకూడదు’ అనే విధంగా నియమ నిబంధనలు మార్చకపోతే రాజీనామా వెనక్కి తీసుకుంటా. ఒకవేళ మారిస్తే, ఓటు వేయడానికో, గెలిపించడానికో నాకు ఇష్టం లేదు అని ప్రకాశ్ రాజ్ అన్నారు.