Begin typing your search above and press return to search.

మెగా మేనల్లుడి కెరీర్ గాడిలో పడినట్లేనా...?

By:  Tupaki Desk   |   15 Oct 2020 1:00 PM GMT
మెగా మేనల్లుడి కెరీర్ గాడిలో పడినట్లేనా...?
X
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ 'రేయ్' అనే సినిమాతో తెరంగేట్రం చేయాలనుకున్నాడు. కానీ అనివార్య కారణాల వల్ల 'పిల్లా నువ్వులేని జీవితం' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కెరీర్ స్టార్టింగ్ లో వరుస విజయాలను చూసిన తేజ్.. ఆ తర్వాత వరుసగా అర డజన్ ఫ్లాపులను చవి చూసాడు. 'పిల్లా నువ్వులేని జీవితం' 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' 'సుప్రీమ్' సినిమాలు సక్సెస్ సాధించగా.. 'తిక్క' 'విన్నర్' 'నక్షత్రం' 'జవాన్' 'ఇంటెలిజెంట్' 'తేజ్ ఐ లవ్ యూ' లాంటి ఘోర పరాజయాలుగా మిగిలాయి. అయితే హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా తేజ్ తన మార్కెట్ పెంచుకునే ప్రయత్నం చేస్తూనే వస్తున్నాడు. ఈ నేపథ్యంలో కిషోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చిన 'చిత్రలహరి' సినిమాతో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన 'ప్రతీరోజూ పండగే' సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇప్పుడు దాదాపు 35 కోట్ల షేర్ క‌లెక్ష‌న్స్ తెచ్చుకునే రేంజ్ కి వ‌చ్చేశాడు. ఈ ఉత్సాహంతో తేజ్ ఇప్పుడు మరిన్ని సినిమాలకు ఓకే చెప్పాడు.

సాయి ధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ 'సోలో బ్రతుకే సో బెటర్‌'. సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని జీ 5 డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ వారు తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో తేజ్ 'ప్రస్థానం' దేవా కట్ట దర్శకత్వంలో చేయబోయే సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానుంది. జె.బి.ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్‌ పై రూపొందనున్న ఈ చిత్రాన్ని జె.భగవాన్ - జె.పుల్లారావు నిర్మించనున్నారు. ఈ రెండు ప్రాజెక్ట్స్ హిట్ అయితే మెగా మేనల్లుడు మరో స్థాయికి వెళ్లినట్లేనని ఇండస్ట్రీ వర్గాల్లో అనుకుంటున్నారు. వీటితో దీంతో పాటు కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో ఓ మిస్టికల్ థ్రిల్లర్ లో నటించనున్నాడు. ఈ చిత్రాన్ని బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్ మరియు సుకుమార్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అంతేకాకుండా గోపాలకృష్ణ అనే కొత్త దర్శకుడితో 'భగవద్గీత సాక్షిగా' అనే సినిమా చేయడానికి సన్నాహకాలు జరుగుతున్నాయని ఫిలిం సర్కిల్స్ లో టాక్. ఏదైమైనా సాయి తేజ్ సక్సెస్ ట్రాక్ ఎక్క‌డానే చెప్పాలి. నేడు సాయి ధరమ్ తేజ్ బర్త్ డే సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ప్రస్తుతం తేజ్ నటించే సినిమాలన్నీ విజయవంతం కావాలని కోరుకుందాం!