Begin typing your search above and press return to search.
300 మంది డాన్సర్లుతో..మణిరత్నం కెరీర్ లోనే తొలిసారి!
By: Tupaki Desk | 16 July 2022 11:30 AM GMTస్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో 'పొన్నియన్ సెల్వన్' భారీ కాన్సాస్ పై రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. నవల ఆధారంగా తెరకెక్కుతోన్న పీరియాడిక్ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇటీవలే మొదటి భాగం టీజర్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. టీజర్ కి అసాధారణమైన రెస్పాన్స్ వచ్చింది.
ఒక్క టీజర్ సినిమాని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లింది. 'బాహుబలి' రికార్డులే కొల్లగొడుతుందా? అన్న అంచనాలు మొదలయ్యాయి. మణిరత్నంలో ఇలాంటి యాంగిల్ కూడా ఉందా? అని రెయిజ్ చేసే మూవ్ మెంట్ ని తీసుకొచ్చింది. నిజంగా మణిసర్ నుంచి ఇది ఊహించని సర్ ప్రైజ్. వందల కోట్లు నిర్మాణానికి కేటాయించి తెరకెక్కిస్తున్నారు.
తాజాగా సినిమాకి సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. సినిమాలో ఒక పాటకోసం ఏకంగా 300 మంది డాన్సర్లనే రంగంలోకి దించారు. అందులో 100 మంది ప్రత్యేక డాన్సర్లని ముంబై నుంచి దిగుమతి చేసారు. ఇప్పటికే ఈ పాట చిత్రీకరణ కూడా ముగిసింది. దాదాపు 25 రోజులు పాటు ఈ ఒక్క పాటనే చిత్రీకరించారుట.
అంటే ఈ పాటని ఎంత ప్రతిష్టాత్మకంగా భావించారో అద్దం పడుతుంది. పాట కోసం కోట్ల రూపాయాలు వెచ్చించినట్లు తెలుస్తోంది. రెండు భాగాల మొత్తానికే ఈ పాట హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. అందుకే ఈ పాట మరింత హైలైట్ అయ్యేలా సినిమా రిలీజ్ కి ముందే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారుట. త్వరలోనే ఈ భారీ గీతాన్ని థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు తెలిసింది.
తెలుగు..తమిళం..కన్నడం..మలయాళం..హిందీ భాషల్లో పాట రిలీజ్ అవుతుందిట. ప్రత్యేకంగా ఆయాభాషల్లో పేరొందిన స్టార్ హీరోల చేతుల మీదుగా ఆ పాట రిలీజ్ చేసేలా మణిరత్నం ప్లాన్ చేస్తున్నారుట. మంచి తేదిని నిర్ణయించి ఆ పాటని రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. ఇలాంటి భారీ గీతాన్ని తెరకెక్కించడం మణిరత్నం కెరీర్ లోనే తొలిసారి అని తెలుస్తోంది.
ఇప్పటివరకూ మణిరత్నం భారీ బడ్జెట్ చిత్రాలు చేసింది లేదు. తొలిసారి పొన్నియన్ సెల్వన్ తో పెద్ద ప్రయోగానికి దిగడంతో ఆ ఛాన్స్ వచ్చింది. మరి ఈ పాటలో స్టార్లు అందరూ భాగమవుతారా? కొందరికే ఛాన్స్ ఉంటుందా? అన్నది చూడాలి. ఇందులో విక్రమ్.కార్తీ..జయం రవి..ఐశ్వర్యారాయ్.. త్రిష ప్రధాన పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే.
ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ -మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అన్ని పనులు పూర్తిచేసి సెప్టెంబర్ 30న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.