Begin typing your search above and press return to search.
ఎన్నికలు త్వరగా అవ్వకపోతే చాలా సమస్యలొస్తాయ్!- ప్రకాష్ రాజ్
By: Tupaki Desk | 23 Aug 2021 12:30 AM GMTమూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నికల హీట్ అంతకంతకు రాజుకుపోతున్న సంగతి తెలిసిందే. 2021-24 సీజన్ కి ఎన్నికలు నిర్వహించాలని క్రమశిక్షణా కమిటీ భావిస్తోంది. సెప్టెంబర్ లో ఎన్నికలు అంటూ ప్రచారమవుతోంది. ఆ క్రమంలోనే ఎవరికి వారు తమదైన శైలిలో రాజకీయాలు చేస్తున్నారు.
ప్రకాష్ రాజ్ వర్సెస్ మంచు విష్ణు ఎపిసోడ్స్ కొనసాగుతున్నాయి. వీకే నరేష్ వర్గం హంగామా ... హేమ కామెంట్ల గురించి తెలిసినదే. నరేష్ వర్గాన్ని టార్గెట్ చేసిన హేమకు క్రమశిక్షణా కమిటీ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఇక ఈసారి ఎన్నికల్లో ఐదుగురు సభ్యులు పోటీపడనున్నారు. ఇందులో జీవిత రాజశేఖర్.. సీవీఎల్.. హేమ కూడా ఉన్నారు.అయితే ఎందరు ఉన్నా ప్రకాష్ రాజ్ వర్సెస్ విష్ణు వార్ ప్రధానంగా మారింది. ఆ ఇద్దరిలో ఎవరు అధ్యక్షుడు అంటూ సభ్యుల్లో చర్చ సాగుతోంది.
తాజాగా వర్చువల్ ఈసీ సమావేశంలో ప్రకాష్ రాజ్ చేసిన ఒక వ్యాఖ్య హాట్ టాపిక్ గా మారింది. మా ఎన్నికలు సాధ్యమైనంత తొందరగా జరగాలని లేదంటే వివాదాలు ముదురుతాయని ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఒకరిపై మరొకరు చేసుకుంటున్న వ్యాఖ్యలపై ఎన్నికలు వేడెక్కిపోయాయి. ప్రతీ రోజు ఎవరో ఒకరు కామెంట్ చేయడం క్రమశిక్షణా సంఘం దృష్టికి వెళుతోంది. క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజు అధ్యక్షతన జరిగిన `మా` సర్వసభ్య సమావేశంలో ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలపై అంతా వేడిగా చర్చించుకుంటున్నారు. చాలా సమస్యలొస్తాయి! అంటూ ప్రకాష్ రాజ్ అనడాన్ని బట్టి ఈ ఎన్నికల ముందు ఇంకా వేడి రాజుకుంటుందని అర్థమవుతోంది.