Begin typing your search above and press return to search.
ట్రెండీ టాక్: ఉత్తరాదిన `లోకల్ బోయ్స్` అవ్వాలంటే?
By: Tupaki Desk | 3 March 2021 2:30 PM GMTఇరుగు పొరుగు భాషల నుంచి టాలీవుడ్ కి వచ్చి తెలుగు నేర్చేసుకుని డబ్బింగులు చెప్పేస్తూ గొప్ప కథానాయికలుగా రాణిస్తున్నారు చాలా మంది భామలు. అనుష్క.. సమంత.. అనుపమ పరమేశ్వరన్.. నివేద థామస్ ఇంకా ఎందరో ఈ కోవకే చెందుతారు. ఆశ్చర్యకరంగా బాలీవుడ్ నుంచి వచ్చిన పూజా హెగ్డే నెమ్మదిగా తెలుగు నేర్చేసుకుని మాట్లాడేస్తోంది. ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి కన్నడ నుంచి వచ్చి తెలుగు అద్భుతంగా మాట్టాడేస్తోంది.
ఆర్.ఆర్.ఆర్ లాంటి పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్న ఆలియా భట్ తన పాత్రకు తానే తెలుగులో డబ్బింగ్ చెప్పుకోవడానికి రెడీ అవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆలియా - పూజా ఇక్కడ డబ్బింగ్ చెబుతుంటే .. మన హీరోలు పొరుగు భాషల్లో డబ్బింగ్ లు చెబితే తప్పేం కాదు. అయినా నేర్చుకోవాలన్న జిజ్ఞాస చాలా ముఖ్యం అని విశ్లేషిస్తున్నారు.
కన్నడ రాకింగ్ స్టార్ యష్.. టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఈ ఇద్దరూ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్లుగా ఎదిగేస్తున్న క్రమంలో బాలీవుడ్ లో తమదైన ముద్ర చూపించాలని తపిస్తున్నారు. దేవరకొండ కథానాయకుడిగా తెరకెక్కుతున్న లైగర్ హిందీలోనూ భారీగా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తన పాత్రకు తానే హిందీ డబ్బింగ్ చెప్పుకునేందుకు కోచ్ ని నియమించుకుని మరీ భాష నేర్చేసుకుంటున్నాడని ప్రచారమవుతోంది. సౌత్ లో సత్తా చాటిన దేవరకొండ అటు హిందీ చిత్రసీమలోనూ తనని తాను నిరూపించుకునేందుకు లోకల్ బోయ్ గా ఎదిగేందుకు గొప్ప ప్రయత్నంలో ఉన్నారు. హిందీ నేర్చుకుంటే పాన్ ఇండియా ప్రచారానికి అది పెద్ద ప్లస్ అవుతుంది.
ప్రస్తుతం కేజీఎఫ్ స్టార్ యష్ తన మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా చిత్రం `కేజీఎఫ్ చాప్టర్ 2` హిందీ వెర్షన్ కోసం సొంతంగా డబ్బింగ్ చెప్పుకోబోతున్నారని సమాచారం. హిందీ లో కేజీఎఫ్ ఘనవిజయం నేపథ్యంలో పార్ట్ 2 పైనా భారీ క్రేజు నెలకొంది. ఇదే అదనుగా యష్ అక్కడ లోకల్ బోయ్ లా అభిమానం అందుకోవాలనుకుంటున్నాడు. దానికి భాష నేర్చుకుని దూసుకెళ్లడమే సరైన నిర్ణయం అని భావిస్తున్నాడు.
కేజీఎఫ్ చిత్రంలో యష్ తో పాటు సంజయ్ దత్ కీలక పాత్రను పోషించడంతో హిందీ బెల్ట్ లో చాప్టర్ 2 పైనా అసాధారణ క్రేజు నెలకొంది. మార్కెట్ పరంగానూ ఇది వర్కవుటవుతోంది. కేజీఎఫ్ చాప్టర్ 2 చిత్రం 2021 జూలై 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.
ఇంతకుముందు సాహో కోసం సొంతంగా సోని అనే కోచ్ ని నియమించుకుని హిందీ నేర్చుకున్నారు ప్రభాస్. సొంతంగానే హిందీ డబ్బింగ్ చెప్పుకోవడంతో అక్కడ లోకల్ బోయ్ లా కనెక్టయిపోయారు. 2021 అక్టోబర్ లో రిలీజ్ కి రెడీ అవుతున్న ఆర్.ఆర్.ఆర్ కోసం తారక్.. చరణ్ కూడా సొంతంగానే హిందీలో డబ్బింగ్ చెప్పుకుంటారని ప్రచారం ఉంది. చరణ్ ఇప్పటికే హిందీ ఆడియెన్ కి సుపరిచితుడు. తారక్ ఆర్.ఆర్.ఆర్ తో నే ఘనమైన ఎంట్రీ ఇస్తున్నాడు. పుష్ప చిత్రానికి బన్ని స్వయంగా హిందీ డబ్బింగ్ చెప్పుకునేందుకు రెడీ అవుతున్నారు. ఇక హిందీ డబ్బింగుతో వీరంతా కూడా ఉత్తరాదినా లోకల్ బోయ్స్ అనిపించుకునే వీలుంది.