Begin typing your search above and press return to search.
హను సెకండ్ వరల్డ్ వార్ స్టోరీ ఎవరితో?
By: Tupaki Desk | 17 Sep 2022 11:30 PM GMTగత కొంత కాలంగా వరుస ఫ్లాపుల్ని ఎదుర్కొన్న దర్శకుడు హను రాఘవపూడి. అందాల రాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమగాథ' వంటి సినిమాల తరువాత ఆ స్థాయి సక్సెస్ ని అందుకోవాలని చేసిన హను ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి. ఈ నేపథ్యంలో తను తెరకెక్కించిన ఎపిక్ లవ్ స్టోరీ 'సీతారామం'. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ మూవీ ఆగస్టులో విడుదలై ఎపిక్ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. విమర్శకులతో పాటు ప్రేక్షకులు కూడా ఈ మూవీపై ప్రశంసల వర్షం కురిపించారు.
1964లో జరిగిన ఓ ఫిక్షనల్ కథగా హను రాఘవపూడి ఈ మూవీని ఓ దృశ్య కావ్యంగా తెరకెక్కించిన తీరు ప్రతీ ఒక్కరినీ ఔరా అనిపించింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ తొలి రోజు ఆశించిన స్థాయి ఓపెనింగ్స్ ని రాబట్టలేకపోయింది. కారణం దుల్కర్, మృణాల్ లకు తెలుగులో ఇది తొలి సినిమా కావడమే. ఫస్ట్ షోతో టాక్ బయటికి రావడంతో మౌత్ టాక్ మొదలైంది. దీంతో సినిమా హ్యూజ్ హిట్ అని లేలిపోవడంతో ప్రేక్షకులు, విమర్శకులు ఈ మూవీకి బ్రహ్మరథం పట్టారు.
భారీ కలెక్షన్ లని సొంతం చేసుకున్న ఈ మూవీ తరువాత హను రాఘవపూడి మరో పీరియాడిక్ యాక్షన్ డ్రామాని తెరపైకి తీసుకురాబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా వరుస కథనాలు వినిపిస్తున్నాయి. ఈ కథ కూడా హిందూ ముస్లీమ్ జంట ప్రేమకథ నేపథ్యంలోనే సాగుతుందని తెలుస్తోంది. ఇదిలా వుంటే ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హను రాఘవపూడి వెల్లడించారు.
సెకండ్ వరల్డ్ వార్ పేపథ్యంలో ఈ మూవీ వుంటుందని, ఆర్మీ నేపథ్యంలో సాగుతుందని స్పష్టం చేశాడు. ఈ మూవీని హీరో నేచురల్ స్టార్ నానితో ఖచ్చితంగా చేస్తానని చెప్పుకొచ్చాడు. గతంలో నేచురల్ స్టార్ నానితో హను రాఘవపూడి 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' మూవీని రూపొందించిన విషయం తెలిసిందే. ప్రేమకథకు, టెర్రిరిజానికి లింకప్ చేస్తూ తెరకెక్కించిన ఈ మూవీ మంచి విజయాన్ని సాధించడమే కాకుండా హీరో నానికి మంచి పేరు తెచ్చిపెట్టింది.
మళ్లీ ఈ ఇద్దరు కలిసి సెకండ్ వరల్డ్ వార్ నేపథ్యంలో సాగే ప్రేమకథా చిత్రాన్ని చేయబోతుండటం ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే బయటికి రానున్నాయి. ప్రస్తుతం నాని 'దసరా'మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ మూవీని వచ్చే ఏడాది మార్చి 30న విడుదల చేయబోతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.