Begin typing your search above and press return to search.

వితౌట్ రెమ్యునరేషన్ కానీ నాలుగు కోట్లయిందట

By:  Tupaki Desk   |   5 Dec 2019 6:40 AM GMT
వితౌట్ రెమ్యునరేషన్ కానీ నాలుగు కోట్లయిందట
X
ఏ సినిమా అయినా తీసేముందు ఆ హీరో హీరోయిన్ మీద అంత వర్కౌట్ అవుతుందా ? అనేది పక్కగా చూసుకోవాలి లేదంటే రిలీజ్ తర్వాత నష్టాలు చూడాల్సి వస్తుంది. అయితే కమెడియన్స్ అందరూ కలిసి ఒక బడ్జెట్ వేసుకొని 'భాగ్య నగర వీధుల్లో గమ్మత్తు' అనే సినిమా తీసారు. శ్రీనివాస్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను ముందుగా రెండు కోట్లతో తీయలనుకున్నారట.

అయితే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తయ్యే సరికి సినిమా టోటల్ బడ్జెట్ నాలుగు కోట్లయిందట. ఈ విషయాన్ని శ్రీనివాస్ రెడ్డి స్వయంగా ఇంటర్వ్యూ చెప్పాడు. ఇక శ్రీనివాస్ రెడ్డి సహా సినిమాకు పనిచేసిన ఆర్టిస్టులంతా వితౌట్ రెమ్యునరేషన్ కే నటించారు. సినిమా హిట్టయితే ఎంతో కొంత వారికి ముట్టచెప్పేలా మాట్లాడుకున్నాడట శ్రీనివాస్ రెడ్డి. ఇక సినిమాకయిన బడ్జెట్ ఫ్లయింగ్ కలర్స్ లో కొందరు కమెడియన్స్ పెట్టారట.

అయితే రేపు రిలీజ్ కానున్న ఈ సినిమాకు పెద్దగా ప్రమోషన్స్ లేవు. అనుకోకుండా డేట్ దొరకటంతో దిల్ రాజు ఓ డేట్ ఫిక్సయి వేసేద్దాం అనగానే శ్రీనివాస్ రెడ్డి ఎస్ అనేసాడు. సో మరి పెద్దగా బజ్ లేని ఈ కామెడీ సినిమా కమెడియన్స్ కి రిటర్న్స్ తెచ్చిపెట్టి లాభాలు తీసుకోస్తుందా చూడాలి.